CM Chandrababu Amaravati: ఏ రాజకీయ పార్టీకైనా ప్రజాభిప్రాయమే ఫైనల్. ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా వెళితే ప్రతికూల ఫలితాలు తప్పవు. అయితే ఈ విషయంలో వెనక్కి తగ్గిన వారే ప్రజల మధ్య నిలబడగలరు. కానీ ఈ విషయంలో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మొండిగా ముందుకు వెళ్తున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా అమరావతి రాజధాని నిర్మాణం పై ఆయన అభిప్రాయం మారలేదు. ఇటీవల ప్రెస్ మీట్ లో అమరావతిపై విముఖత చూపేలా మాట్లాడారు. ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు ఆ పార్టీ అనుకూల మీడియా, సోషల్ మీడియా గురించి చెప్పనవసరం లేదు. పేర్ని నాని లాంటి వ్యక్తి అయితే అమరావతిని ఉద్దేశించి చాలా తేలిగ్గా మాట్లాడారు. అమరావతి మునిగిపోతుందని ఒకరు.. అక్కడ పెట్టుబడి పెట్టడం వేస్ట్ అన్నట్టు మాట్లాడారు. చివరకు వైసిపి గెలిచిన జగన్ అమరావతి నుంచి పాలన సాగిస్తారన్న సకల శాఖ మంత్రి సజ్జలకు సైతం జగన్ క్లాస్ పీకినట్లు వార్తలు వచ్చాయి. అమరావతి రాజధానిపై నాడు జగన్ సర్కార్ వ్యవహరించిన తీరు కూడా మొన్నటి ఓటమికి ఒక కారణం. కానీ దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు జగన్మోహన్ రెడ్డి.
* సాగు చట్టాలు వెనక్కి..
2014, 2019 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఆ రెండుసార్లుతో పోల్చుకుంటే 2024 ఎన్నికల్లో బిజెపికి వచ్చిన స్థానాలు చాలా తక్కువ. దానికి కారణం లేకపోలేదు. వ్యవసాయానికి సంబంధించి మూడు సాగు చట్టాలను తీసుకొచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. దేశవ్యాప్తంగా దీనిపై రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ప్రజల అసంతృప్తిని గమనించారు నరేంద్ర మోడీ. తాను ప్రవేశపెట్టిన సాగు చట్టాలపై ప్రజలకు అర్థమయ్యేలా చెప్పలేకపోయామని.. అందుకే వాటిని రద్దు చేస్తున్నట్లు చెప్పి వెనక్కి తగ్గారు ప్రధాని మోదీ. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎప్పుడైతే సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నారు కొంత సానుకూలత గా మార్చుకోండి బిజెపి. ఆ సాగు చట్టాలను వెనక్కి తీసుకోకుంటే మాత్రం బిజెపికి భారీ మూల్యం తప్పదు.
* ఆర్బిఐ తో పాటు అన్ని బ్యాంకులు..
అయితే మొన్నటి ఎన్నికల్లో జగన్ ( Y S Jagan Mohan Reddy )మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకించారు. అయినా సరే వైసీపీ అమరావతిపై విషం చిమ్మడం మానలేదు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సైతం స్పష్టమైన సంకేతాలు పంపగలిగింది. ఇకమీదట అమరావతి రాజధానిని కదిలించలేరని తన చర్యల ద్వారా చెప్పింది. ఏకంగా కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ప్రధాన కార్యాలయాన్ని అమరావతిలో నిర్మించాలని భావిస్తోంది. నాలుగు ఎకరాల భూమిని అమరావతిలో కొనుగోలు చేసింది. 12 కోట్ల రూపాయలు వెచ్చించి ఏపీ ప్రభుత్వం నుంచి ఆ భూమిని కొనుగోలు చేసింది రిజర్వ్ బ్యాంక్. అన్ని ఆలోచించి రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయానికి వచ్చింది. కచ్చితంగా అమరావతిని కేంద్రం చట్టబద్ధత చేస్తుందని తెలిసి ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రిజర్వ్ బ్యాంక్ పరిధిలో పనిచేసే 12 ప్రాంతీయ బ్యాంకుల సైతం తమ ప్రధాన కార్యాలయాలను నిర్మించనున్నాయి. ఈ నెల 28న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఈ కార్యాలయ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. కేంద్రం నుంచి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే ఈ ఆర్థిక రంగ బ్యాంకింగ్ సంస్థల ఏర్పాటు జరుగుతుంది. అంటే త్వరలో పార్లమెంటులో అమరావతి రాజధానికి చట్టబద్ధత లభించనుందన్నమాట.