Kiran Royal: ఏపీలో కిరణ్ రాయల్( Kiran Royal) వివాదం మరో మలుపు తిరిగింది. బాధితురాలు మరోసారి మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేశారు. ఈసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి పేరును తెరపైకి తెచ్చారు. కొద్దిరోజుల కిందట కిరణ్ రాయల్ పై లక్ష్మీ రెడ్డి అనే మహిళ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన వద్ద కోటి 20 లక్షల నగదు తో పాటు 25 సవర్ల బంగారాన్ని తీసుకున్న కిరణ్ రాయల్ మోసం చేశాడని.. తిరిగి అడుగుతుంటే చంపేస్తానని బెదిరించాడంటూ లక్ష్మీరెడ్డి ఆరోపించారు. తనకు ఆత్మహత్య శరణ్యం అంటూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అప్పటినుంచి వివాదం ప్రారంభం అయింది.
* జనసేన కార్యకలాపాలకు దూరం
అయితే జనసేన( janasena ) నేతగా ఉన్న కిరణ్ రాయల్ చుట్టూ వివాదం నడవడంతో ఆ పార్టీ హై కమాండ్ స్పందించింది. పార్టీ అంతర్గత విచారణ అయ్యేవరకు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. అయితే బాధితురాలు లక్ష్మీరెడ్డికి వేధింపులు అధికం కావడంతో ఆమె మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు. ఎన్నికలకు ముందు తనతో రాజీకి వచ్చారని.. కాళ్లు కూడా పట్టుకున్నారని.. దయచేసి విషయాన్ని బయట పెడితే తన రాజకీయ జీవితం ముగుస్తుందని కోరడంతో ఊరుకున్నానని.. ఇప్పుడు మాత్రం చంపేస్తానని మరోసారి బెదిరింపులకు దిగుతున్నాడు అంటూ చెప్పుకొచ్చారు లక్ష్మిరెడ్డి( Lakshmi Reddy) తనను ఆదుకోవాలని సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ను సైతం విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తనకు అండగా ఉండాలంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సైతం విన్నవించారు. అయితే ఇంతలో జైపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఓ పాత కేసులో ఆమెను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
* మరోసారి మీడియా ముందుకు
అయితే ఆ కేసులో ఆమెకు బెయిల్( bail) లభించింది. దీంతో జైపూర్ నుంచి తిరుపతి చేరుకున్న ఆమె ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి రోజా దగ్గర బంధువైన మహిళతో కిరణ్ రాయల్కు వివాహేతర సంబంధం ఉందని ఆరోపించారు. రోజాను తిట్టిన కేసులో కిరణ్ అరెస్ట్ అయిన తర్వాత రాత్రికి రాత్రే బయటకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దానికి కారణం రోజా దగ్గర బంధువుతో ఉన్న సంబంధమే అని చెప్పుకొచ్చారు. ఆ మహిళతో ఉన్న వీడియోలు, ఫోటోలను అడ్డం పెట్టుకొని అప్పటి మంత్రి రోజాను భయపెట్టి బయటకు వచ్చాడు అంటూ లక్ష్మీరెడ్డి సంచలన విషయాలను బయటపెట్టారు.
* ఆయన లీలలు అనేకం..
మరోవైపు తనపై కిలాడీ లేడీ అని ముద్ర వేసారని ఆవేదన వ్యక్తం చేశారు లక్ష్మీరెడ్డి( Lakshmi Reddy). అవసరానికి వాడుకొని.. అవసరం తీరాక తనను విడిచిపెట్టాడంటూ వాపోయారు. అసలు కిరణ్ రాయల్ కు ఏ వ్యాపారాలు లేవన్నారు. భూమన అభినయ్ రెడ్డితో వివాహేతర సంబంధం ఉందని కిరణ్ రాయల్ చెప్పడం దారుణమన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లను అడ్డగోలుగా అమ్ముకున్న చరిత్ర కిరణ్ రాయల్ దే అని ఆరోపించారు. చెన్నై నల్లి సిల్క్స్ చీరలు తెచ్చి.. శ్రీవారి వస్త్రం పేరుతో అమ్ముకున్న చరిత్ర అతనిదని సంచలన ఆరోపణలు చేశారు. ఫోటోలను మార్ఫింగ్ చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని.. మొన్న జగన్మోహన్ రెడ్డి 2.0 అని ప్రకటించగానే.. జగన్ ఫోటోలు రోబో 2.0 గా మార్ఫింగ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అవసరమైతే పవన్ కళ్యాణ్ కు సైతం బ్లాక్ మెయిల్ చేస్తానని.. ఆఫ్ట్రాల్ నువ్వు ఎంత అంటూ తనని బెదిరించిన విషయాన్ని గుర్తు చేశారు లక్ష్మీరెడ్డి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి.. రహస్య వీడియోల పెన్ డ్రైవ్ కూడా తన వద్ద ఉందని చెప్పేవాడని.. తన విషయంలో పవన్ కళ్యాణ్ ఏమి అనడని.. మంత్రి నాదెండ్ల మనోహర్ సైతం చెప్పుచేతల్లో ఉంటారని తనతో చాలా సందర్భాల్లో అన్నాడని చెప్పారు లక్ష్మీరెడ్డి. చాలాసార్లు పవన్ కళ్యాణ్ సైతం బ్లాక్ మెయిల్ చేశానని అన్నాడని కూడా గుర్తు చేశారు. లక్ష్మి రెడ్డి తాజా ఆరోపణలు ప్రకంపనలు రేపుతున్నాయి. మరోసారి ఈ వివాదం వైరల్ అంశంగా మారుతోంది. మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.
ఒడియమ్మ ఏంటండీ మీరు మాట్లాడేది pic.twitter.com/RhWbWIMjxH
— Avinash (@ysj_39) February 15, 2025