Komati Reddy Venkata Reddy: జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy ) శాసనసభకు వెళ్లడం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వనందున తాను సభకు హాజరుకానని చెబుతున్నారు. అయితే అది సహేతుకమైన కారణం అయితే మాత్రం కాదు. ఎందుకంటే ఆయన నిర్ణయాన్ని ఎవరు ఆహ్వానించడం లేదు కూడా. తెలంగాణలో తన మిత్రుడు కేసిఆర్ సభకు హాజరు కావడం లేదు. కానీ తమ పార్టీ ఎమ్మెల్యేలను పంపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ పని కూడా చేయడం లేదు. అదేమని ప్రశ్నిస్తుంటే సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వరు కదా అని చెప్పుకొస్తున్నారు. అదే ప్రతిపక్ష హోదా ఉంటే గంటల తరబడి ప్రజా సమస్యలపై మాట్లాడవచ్చునని గుర్తు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ఎవ్వరూ సహించడం లేదు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు సైతం అదే భావనతో ఉన్నారు. కానీ ఆయనకు చెప్పేందుకు జంకుతున్నారు. చివరకు తన తండ్రి తో పాటు తన కుటుంబ శ్రేయోభిలాషులు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు సైతం సభకు హాజరు కాకపోవడాన్ని తప్పుపడుతున్నారు. అయినా సరే జగన్ తీరులో మార్పు రావడం లేదు.
*+శాసనసభలో వ్యవహారం అలా..
రాజకీయంలో అంటే కేవలం గెలుపు కాదు ఓటములు ఉంటాయని జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవడం లేదు. అదే తెలిసి ఉంటే వైసిపి హయాంలో సభను సజావుగా నడిపేవారు కదా? ఆ ఒక్కరిద్దరూ నేతలతో చంద్రబాబు ( Chandrababu) లాంటి వారిని దారుణంగా అవమానించారు. ఆయన కుటుంబం పై మాట్లాడి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అది తనకు రివర్స్ అవుతుందని తెలిసి సభకు హాజరు కావడం లేదు. దానిని ప్రతిపక్ష హోదాతో మెలిక పెడుతున్నారు. అయితే ప్రతిపక్ష హోదా ఇవ్వనందున సభకు హాజరు కాకపోవడం తప్పు అని తన సన్నిహితుడైన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే వీరిద్దరే కాదు చాలామంది జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చారు. కానీ ఒక్కరి సలహాను పాటించే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లేరన్న విషయాన్ని గ్రహించుకోవాలి.
* రాజశేఖర్ రెడ్డి కుటుంబ విధేయుడు..
కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ( Venkat Reddy) అంటే రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత విధేయుడు. ఆ కుటుంబం మంచే కోరుకుంటారు. అటువంటి వ్యక్తి ఏపీకి వచ్చి మరి సలహా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. ఎంచక్కా శాసనసభకు వెళ్లి పోరాటం చేసి ప్రజల అభిమానాన్ని పొందాలని సూచించారు. అంతకంటే ముందే జగన్ పై పరోక్ష ప్రేమ ఉండే ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం అదే సలహా ఇచ్చారు. సభకు వెళ్లి చంద్రబాబును ఒక ఆట ఆడుకోవాలి అంటూ సూచించారు. ఉండవెల్లి అభిమానం.. ఇటు నుంచి పెద్దరికాన్ని గౌరవించే పరిస్థితి ఉండదు కదా జగన్ కనీసం పట్టించుకోలేదు ఉండవెల్లి సలహాకు. అయితే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పేసరికి ప్రజల్లో కొంచెం చర్చ జరుగుతోంది. పైగా సలహా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి హితుడే కదా అన్నట్టు మాట్లాడుతున్నారు ఎక్కువమంది. జగన్మోహన్ రెడ్డి పట్ల ఎవరికి ఎన్ని అభిప్రాయాలు ఉన్నా.. ఎవరు ఎన్ని సలహాలు ఇచ్చినా ఆయన మాత్రం పట్టించుకునే స్థితిలో ఉండరు.