Homeఆంధ్రప్రదేశ్‌Kolikapudi Controversy: కొలికపూడి మళ్లీ కెలికాడు.. వీడియో వైరల్!

Kolikapudi Controversy: కొలికపూడి మళ్లీ కెలికాడు.. వీడియో వైరల్!

Kolikapudi Controversy: కృష్ణా జిల్లాలో( Krishna district) ఇసుక అక్రమ రవాణా అధికార తెలుగుదేశం పార్టీలో కలవరం రేపుతోంది. అధికార పార్టీలో విభేదాలను బయటపెట్టింది. ఈ ఇసుక వివాదంపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అంశం గా మారింది. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే పోలీస్ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మరి వాగ్వాదానికి దిగారు. ఏకంగా సొంత పార్టీ నేతలపై సదరు ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు. దీంతో అధికార పార్టీలో కొత్త పంచాయితీ ప్రారంభం అయింది. ఇప్పటికే ఆ జిల్లాలో ఆ ఎమ్మెల్యే పనితీరుపై అనేక రకాల విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు పార్టీని ఇరకాటంలో పెట్టేలా ఆయన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి.

Also Read:  ఆ ఎమ్మెల్యే ఏడాది సంపాదన రూ.100 కోట్లు.. మాజీమంత్రి ఆడియో లీక్

పెద్ద వరంలో భారీ డంప్..
కృష్ణా నది పరివాహక ప్రాంతాల నుంచి ఇసుకను పెద్ద ఎత్తున తెలంగాణకు( Telangana) తరలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గం పరిధిలోని పెద్దవరం నుంచి భారీగా ఇసుక తరలితోందన్న సమాచారం అందుకున్నారు స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. గ్రామస్తులతో కలిసి శుక్రవారం రాత్రి పరిశీలించారు. ఇసుక అక్రమ రవాణాలో పోలీసుల పాత్ర ఉందని.. పోలీసుల దగ్గరుండి సెటిల్మెంట్లు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఏసీపీతో ఫోన్లో మాట్లాడిన కొలికపూడి ఆయనతో వాగ్వాదానికి దిగారు. తిరువూరు కు చెందిన గంజాయి బ్యాచ్కు ఇసుక అక్రమ రవాణా తో సంబంధం ఉందని ఆరోపించారు. ఒకే వ్యక్తి పేరుతో ఇసుక బుకింగ్స్ జరుగుతున్నాయని కూడా ఆరోపించారు కొలికపూడి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హైలెట్ అవుతోంది.

Also Read:  విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ.. గుట్టు విప్పేసిన కేంద్రం!

ఆది నుంచి అదే పరిస్థితి..
తిరువూరులో( thiruvuru ) తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి కొలికపూడి తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే హై కమాండ్ పలుమార్లు ఆయనను హెచ్చరించింది. అయితే ఈ ఇసుక అక్రమ రవాణాలో ఎంపీ అనుచరుల పాత్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే, ఎంపీ మధ్య విభేదాలు నడుస్తున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం విశేషం. అయితే తిరువూరు ఎమ్మెల్యేకు మిగతా టిడిపి నేతలతో పడదన్న కామెంట్స్ ఉన్నాయి. అయితే ఈ ఇసుక దుమారం ఎంతవరకు తీసుకెళ్తుందో చూడాలి. పైగా కొద్ది రోజుల కిందట గంజాయి వివాదానికి సంబంధించి ఏకంగా పోలీస్ స్టేషన్కు ఎమ్మెల్యే. గంజాయి బ్యాచ్ తో పోలీసులకు లింకు ఉందని ఆరోపించారు. ఇప్పుడు ఏకంగా ఇసుక వివాదంలో కూడా పోలీసులపై ఆరోపణలు చేశారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఈ ఆరోపణలు చేయడంపై కూటమి పార్టీల్లో విస్తృత చర్చ నడుస్తోంది. పార్టీ హై కమాండ్ ఎమ్మెల్యే కొలికపూడి పై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular