Kodali Nani – BJP : బూతుల తుంపర్లతో మాట్లాడే నాయకుడు కొడాలి నాని. సాధారణంగా ఆయన నోటిలో నోరు పెట్టేందుకు ఎవరూ సాహసించరు. అమ్మనా బూతులతో విరుచుకుపడడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. చివరకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను సైతం విడిచిపెట్టలేదు. కోట్లాది మందిని అలరిస్తున్న ఆయనపైనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే తెలుగులో రజనీ అభిమాన సంఘాలు లేవు కాబట్టి సరిపోయింది. లేకుంటే విధ్వంసాలకు నాని తుంపర వ్యాఖ్యలు కారణమయ్యేవి.
అయితే నోటిదూలకు అలవాటు పడిపోయిన కొడాలి నాని ఇప్పుడు బీజేపీ నేతలకు టార్గెట్ అయ్యారు. ఆ పార్టీ ఏపీ వ్యవహారాల సహాయ ఇన్ చార్జి సునీల్ దియోధర్ ను ఏకంగా పకోడి గాడు అని సంభోదించి చిక్కుల్లో చిక్కుకున్నాడు నాని. ఇటీవల గుడివాడలో చార్జిషీట్ పేరిట బీజేపీ ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కార్యక్రమానికి హాజరైన దియోధర్ మాట్లాడుతూ కొడాలి నాని తీరుపై మండిపడ్డారు. ఆయన భాష వల్ల ఏపీ పరువు పోతోందని.. బీజేపీ రాగానే అలాంటి వారిని జైల్లో పెట్టిస్తామని చెప్పారు. అయితే ఈ విషయం కొడాలి నానికి తెలియడంతో రచ్చరంబోలాగా మారింది. సునీల్ పకోడి గాడు అనే శారు. ఇలాంటి పకోడి గాళ్ల వల్లే కర్ణాటకలో బీజేపీ ఓడిపోయిందన్నారు. ఇంకా అనరాని, వినరాని మాటలు అనేశారు.
ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలు లైన్ లోకి వచ్చారు. నాని అంతు తేల్చుతామన్న రేంజ్ లో స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. అయితే తన మూలంగా బీజేపీతో స్నేహం చెడితే పరిస్థితి ఏమిటని కొడాలి నాని కాస్తా తగ్గినట్టు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారాన్ని ఇక్కడితో వదలకూడదని బీజేపీ నేతలు డిసైడయినట్టున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి అయితే ఓ రేంజ్ లో నానిపై విరుచుకుపడ్డారు. గుడివాడ అభివృద్ధి, వైసీపీ పరిపాలనా వైఫల్యాలు అన్నింటిపై బహిరంగచర్చకు రావాలని సవాల్ చేశారు. శుక్రవారం గన్నవరం బస్టాండ్ దగ్గరకు కొడాలి నాని ఒక్కరే వచ్చినా.. కట్టకట్టుకుని వైసీపీ పెద్దలు వచ్చినా తాను రెడీ అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు.
అయితే వివాదం పెద్దది చేయాలనుకోవడం లేదన్నట్టు కొడాలి నాని నుంచి సంకేతాలు వస్తున్నాయి. లేకుంటే చెవులు మూసుకునేలా ఆయన నుంచి రిప్లయ్ వచ్చేది. టీడీపీ, జనసేన మాదిరిగా వ్యవహరిస్తే అసలుకే ఎసరు వస్తుందని నానికి తెలుసు. అందుకే వ్యూహాత్మకంగా సైలెంట్ అయ్యారు. అయితే సునీల్ దియోధర్ ను పకోడిగాడు అంటూ చులకన చేయడాన్ని మాత్రం బీజేపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అయితే ఎంటర్ టైన్ చేస్తే ఇలానే ఉంటుందని.. ఆదిలోనే కొడాలి నాని వంటి వారిని కంట్రోల్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్న ప్రశ్న బీజేపీ శ్రేణుల నుంచే వ్యక్తమవుతోంది.