Kiran Royal ” తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ వివాదంలో సరికొత్త ట్విస్ట్. కొద్దిరోజుల కిందట తనను అన్ని విధాల వాడుకుని వదిలేసాడంటూ లక్ష్మీరెడ్డి అనే మహిళ కిరణ్ రాయల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో రోజుకో ఆడియో, వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చేది. అయితే అవన్నీ లక్ష్మీరెడ్డి విడుదల చేసినవని అందరూ భావించారు. కానీ ఆ వీడియోలు వెనుక జనసేన కీలక నేత ఒకరు ఉన్నారని తాజాగా బయటపడింది. జనసేనలో కిరణ్ రాయల్ పెత్తనాన్ని సహించలేక ఆ పార్టీకి చెందిన ఓ కీలక నేత ఆ వీడియోలు విడుదల చేసినట్లు తాజాగా వెల్లడయ్యింది.
* బాధితురాలిపై ఒత్తిడి
కిరణ్ రాయల్ వివాదం నేపథ్యంలో బాధితురాలు లక్ష్మీరెడ్డి పై అనేక రకాలుగా ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. కిరణ్ రాయల్ వ్యవహార శైలి వివాదాస్పదం కావడంతో జనసేన నాయకత్వం స్పందించింది. కొద్దిరోజులపాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించింది. దీంతో కిరణ్ రాయల్ పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. అయితే తాజాగా బాధితురాలు లక్ష్మీరెడ్డి మీడియా ముందుకు వచ్చారు. అయితే గత మూడు రోజులుగా కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మీరెడ్డి తో పాటు ఆమె కుమారులపై తీవ్ర ఒత్తిడి పెంచినట్లు సమాచారం. దాని ఫలితంగానే ఆమె మీడియా ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read : రోజుకు ఒక అమ్మాయి కావాలి.. నాకు అమ్మాయిల పిచ్చి.. జనసేన కిరణ్ రాయల్ ఆడియో లీక్.. వైరల్*
* తాజాగా సంచలనం
అయితే మీడియా ముందుకు వచ్చిన బాధితురాలు లక్ష్మీరెడ్డి సంచలన విషయాలు బయటపెట్టారు. తన దగ్గర ఆడియో, వీడియోలు జనసేన కీలక నేతగా ఉన్న హరిప్రసాద్ తీసుకున్నారని.. తనకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని.. ఆ ఆడియోలు, వీడియోలు సోషల్ మీడియాలో బయటకు ఎలా వచ్చాయో తెలియదని ఆమె చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో ఇది కొత్త టర్న్ తీసుకుంది. ఈ వివాదంలో జనసేన కీలక నేత హరిప్రసాద్ పాత్ర బయటపడింది.
* బయటపడిన విభేదాలు
గత కొద్దిరోజులుగా తిరుపతిలో కిరణ్ రాయల్ జనసేనలో చాలా యాక్టివ్ అయ్యారు. రాష్ట్రస్థాయి నేతగా గుర్తింపు సాధించారు. అయితే జనసేనలో కిరణ్ రాయల్ పాత్ర పెరుగుతుండడాన్ని సహించలేని హరిప్రసాద్ ఈ పని చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే అదే సమయంలో ఇటీవల బాధితురాలు లక్ష్మీరెడ్డి తో కిరణ్ రాయల్ రాజీ పడ్డారని.. ఇదంతా హరి ప్రసాద్ చేయించారని చెప్పాలని ఒత్తిడి చేశారని.. అందుకే ఆమె అలా చెప్పారని మరో ప్రచారం నడుస్తోంది. మొత్తానికైతే ఈ ఎపిసోడ్ జనసేనలో మరో ప్రకంపనలకు దారితీస్తోంది.
Also Read: మెగా ప్రాజెక్ట్ కి శ్రీకారం..సందీప్ వంగ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి..ఉగాదికి అధికారిక ప్రకటన!