Homeఆంధ్రప్రదేశ్‌Ajith Kumar Escape: ఖైదీ భీముడు మామూలోడు కాదు!

Ajith Kumar Escape: ఖైదీ భీముడు మామూలోడు కాదు!

Ajith Kumar Escape: ఏపీలో ( Andhra Pradesh)ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న పేరు ఖైదీ భీముడు. గుంటూరు జి జి హెచ్ నుంచి తప్పించుకున్నాడు ఈ అంతర్రాష్ట్ర క్రిమినల్. ఆయన అసలు పేరు భీముడు అజిత్ కుమార్. దీంతో ఆయన కోసం ఇప్పుడు గాలిస్తున్నారు. ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ పై సస్పెండ్ వేటు పడింది. రేపల్లె సబ్ జైల్ సూపరింటెండెంట్ పై సైతం వేటు పడింది. అయితే భీముడు అజిత్ కుమార్ ఇప్పుడే కాదు గతంలో కూడా ఇటువంటి ఎస్కేప్ చేశారు. ఇప్పుడు మరోసారి ఎస్కేప్ అయి ఏపీలో చర్చకు కారణం అవుతున్నారు. ఆయన పరారీ ఎపిసోడ్ ఏపీలో సంచలనంగా మారింది. గుండె నొప్పి పేరుతో నాటకమాడి.. ఆసుపత్రిలో చేరి.. అక్కడ అందరి కళ్ళుగప్పి పారిపోయాడు.

* ఆసుపత్రి నుంచి అదృశ్యం..
రేపల్లె జైలులో( repalle jail ) ఖైదీగా ఉన్నాడు భీముడు అజిత్ కుమార్. అనారోగ్యం పేరుతో ఆసుపత్రిలో చేరిక వెనుక జైలు సూపరింటెండెంట్ సహకారం ఉందని అధికారులు గుర్తించారు. అజిత్ కుమార్ తన సోదరి ద్వారా జైలు సూపరిండెంట్ కు ఆన్లైన్లో 60 వేల రూపాయలు జమ చేసినట్లు అధికారులు గుర్తించారు. భీముడు పరారీ తర్వాత సంచలన విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అంతర్రాష్ట్ర నేరగాడు భీముడు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం నాగన్న గూడెం ఆయన స్వగ్రామం. నాలుగు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడడం.. ఆయనపై ఏకంగా 32 కేసులు కూడా కొనసాగుతున్నాయి. కానీ ఎప్పటికప్పుడు పోలీసులకు మస్కా కొట్టి తిరుగుతుంటాడు.

* పదేళ్ల కిందట ఇలానే..
పదేళ్ల కిందట ఒంగోలులో( Ongole) గ్రానైట్ వ్యాపారం పేరుతో మోసాలకు పాల్పడ్డాడు. వ్యాపారులను బురిడీ కొట్టించాడు. క్యాబ్ డ్రైవర్లకు డబ్బులు ఆశ చూపి వారి పేర్లతో సిమ్ లు కొనుగోలు చేసి మోసం చేశాడు. బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు జమ చేయించి ఆ సిమ్ పడేసేవాడు. 2018లో భీముడు అజిత్ కుమార్ ను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. రిమాండ్ నిమిత్తం ఒంగోలు జైలుకు తరలించారు ఆ సమయంలో కూడా అనారోగ్యం పేరుతో ఆసుపత్రిలో చేరి ఎస్కేప్ అయ్యాడు. ఇప్పుడు కూడా అలానే చేశాడు.

భీముడు పై ఏపీతోపాటు తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రల్లో కలిపి మొత్తం 32 కేసులు ఉన్నాయి. ఇటీవల విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ప్రస్తుతం రేపల్లె సబ్ జైలులో ఖైదీగా ఉన్నారు. తనకు గుండె లో నొప్పి అంటూ నాటక మాడాడు. గుంటూరు ఆసుపత్రికి వెళ్ళాడు. మార్చి 28న వాష్ రూమ్ కు వెళ్లి వస్తానని చెప్పిన అజిత్ కుమార్ బయటకు నడుచుకుంటూ వెళ్లి ఆటోలో ఎక్కి పారిపోయాడు. అయితే భీముడు అజిత్ కుమార్ పరారీ వెనుక జరిగిన చిత్రాలన్నీ బయటపడుతుండడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version