Duvvada Srinivas Family : దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు మాధురి యూటర్న్ తీసుకున్నారు. కొద్దిరోజుల పాటు ఈ వివాదానికి దూరంగా ఉంటానని ఆమె చెప్పిన సంగతి తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్ ఆస్తిపాస్తులతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చిన ఆమె.. నేరుగా దువ్వాడ నివాసంలోకి చేరడం కొత్త వివాదానికి దారితీస్తోంది. ఎమ్మెల్సీ దువ్వాడ కొత్త నివాసం వద్ద ఆయన భార్య వాణి, ఇద్దరు పిల్లలు ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. వారి మధ్య సయోధ్యకు కుటుంబ సభ్యులు చర్చలు జరిపారు. అయినా వివాదం ఒక కొలిక్కి రాలేదు. ఇంతలోనే మాధురి నేరుగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో చేరడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ వివాదం మరో మలుపు తిరిగినట్లు అయ్యింది. ఇటీవల ఈ వివాదానికి బ్రేక్ పడినట్లు అంతా భావించారు. కానీ మాధురికి ఆ మధ్య జరిగిన ప్రమాదం ఆత్మహత్యాయత్నం అని అంతా భావించారు. కానీ అది రోడ్డు ప్రమాదమేనని.. కావలిసే ఆత్మహత్యాయత్నం గా చిత్రీకరించి.. దువ్వాడ వాణి వేధింపులతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు మాధురి చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్, మాధురి మధ్య ఫోన్ సంభాషణలు బయటపడ్డాయి. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా మాధురి దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ప్రవేశించడం కొత్త సంచలనంగా మారింది.
* కొత్త ఇంటి చుట్టూ
దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇంటి నిర్మాణం చుట్టూ వివాదం జరుగుతోంది. ఆ ఇంటిని రాసి ఇవ్వాలని దువ్వాడ వాణి కోరుతున్నారు. తన ఇద్దరి పిల్లల పేరిట రాసివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇంటిని రాసి ఇవ్వనని దువ్వాడ తెగేసి చెబుతున్నారు. పిల్లలిద్దరి బాధ్యత చూసుకుంటానని చెప్పుకొస్తున్నారు. మరోవైపు తమకు ఆస్తిపాస్తులు వద్దని.. అందరం కలిసి ఉందామని వాణి ప్రతిపాదన పెట్టారు. అయితే పరిస్థితి ఇంత దాకా వచ్చాక కలిసి ఉండే ప్రసక్తి లేదని దువ్వాడ తేల్చి చెబుతున్నారు. విషయం కోర్టులో ఉండడంతో తీర్పు మేరకు నడుచుకుందామని తెగేసి చెబుతున్నారు.
* రోజుకో మలుపు
తొలుత ఆ ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చును తాను భరించానని దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు చెప్పుకొచ్చాడు. అక్కడకు కొద్ది రోజులు పోయాక ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు తెరపైకి వచ్చాడు. దువ్వాడ శ్రీనివాస్ నిర్మించిన స్థలం తనదంటూ.. ఆ ఇంటి పై హక్కు తనదేనని చెప్పడంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగినట్లు అయింది. ఈ నేపథ్యంలో సమీప బంధువులు, సామాజిక వర్గ నాయకులు కీలక చర్చలు జరిపారు. అన్ని అంశాలకు ఒక పరిష్కార మార్గం దొరకగా.. కొత్త ఇంటికి సంబంధించి మాత్రం వివాదం తేలలేదు. అయినా సరే దువ్వాడ వాణి తన నిరసనను కొనసాగిస్తున్నారు.
* మాధురి సడన్ ఎంట్రీ
అయితే దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు మాధురి ఇటీవల కనిపించకుండా మానేశారు. తలకు దెబ్బ తగిలినందున కొద్ది రోజులు పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని ఆమె ప్రకటించారు. ఇంతలోనే దువ్వాడ శ్రీనివాస్ తో రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో జరిపిన ఫోన్ సంభాషణలు బయటికి వచ్చాయి. ఇప్పుడు ఏకంగా మాధురి దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. దువ్వాడ వాణి నిరసన కొనసాగుతుండగానే నేరుగా ఇంట్లోకి వెళ్లారు. దీంతో వాణి తో పాటు ఇద్దరు పిల్లలు షాక్ కు గురయ్యారు. మున్ముందుదువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ మరింత రచ్చకు దారి తీసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More