Kesineni Nani TDP: తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) నేతలపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు.. సొంత పార్టీ నేతలు విమర్శించినప్పుడు.. అది వైసిపి తో పాటు సాక్షికి మంచి ఆహారంగా మారుతోంది. అయితే సరైన మాటకారులను ఉపయోగించడంలో మాత్రం వైసిపి విఫలమవుతోంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పై.. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ టికెట్ కోసం తన వద్ద డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. అది మొదలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అది ఒక ఆహారంగా మారింది. వాస్తవానికి టిక్కెట్లకు డబ్బులు అనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పనవసరం లేదు. ఎందుకంటే డబ్బులు ఖర్చు చేసిన వారికి మాత్రమే ఆ పార్టీ టికెట్లు దక్కాయి అన్నది బహిరంగ రహస్యం. ఇంతకుముందు చాలామంది వైసిపి నేతలు సైతం ఇలాంటి ఆరోపణలు చేశారు సొంత పార్టీ పైన. అయితే ఆరోపణలు వచ్చింది కేశినేని చిన్ని పై. ఇక్కడ రంగంలోకి దిగాల్సింది ఆయన సోదరుడు కేసినేని నాని. ఆయన రాకుండా మాజీ మంత్రి పేర్ని నాని వచ్చేసారు. కేశినేని చిన్ని పై విమర్శలు చేసేసారు.
Also Read: ప్రమాదపుటంచున ఏపీ.. దూసుకొస్తున్న ‘మొంథా’!
* ఇదే సరైన సమయం అయినా..
తెలుగుదేశం పార్టీ పైన, కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేసేందుకు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి పేర్ని నాని తప్ప మరొకరు దొరకరా? అనే ప్రశ్న వినిపిస్తోంది. ఆయన లాజిక్ గా మాట్లాడుతారు. ప్రతి అంశంలో లాజిక్కులు వెతుకుతారు. కానీ పదే పదే ఆయన మీడియా ముందుకు రావడం.. చేసిన విమర్శలు చేయడం.. దానికి ఆయన దీర్ఘాలు పలకడం.. మరి ఎబెట్టుగా మారుతుంది. వాస్తవానికి ఎంపీ కేసినేని చిన్ని పై ఇంతేత్తుకు ఎగసిపడే ఆయన సోదరుడు కేశినేని నాని ముందుకు రాకపోవడం మాత్రం పలు అనుమానాలకు తావిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినా ఆయన ఆ పార్టీ లైన్లోనే మొన్నటి వరకు మాట్లాడారు. ఇప్పుడు తమ్ముడు చిన్ని పై పెద్ద ఆరోపణలు వచ్చిన ఆయన పట్టించుకోకపోవడం చూస్తుంటే.. ఇక ఆయన వైసీపీలోకి వెళ్ళలేరు. టిడిపిలోకి వస్తారన్న ప్రచారం సాగుతోంది.
* మారిన పరిస్థితులతో..
తనను సైడ్ చేసి టిడిపి హై కమాండ్ తో సఖ్యత ఏర్పరచుకున్న తన సోదరుడు అంటే కేశినేని నానికి( Kesineni Nani ) విపరీతమైన కోపం. టిడిపి నాయకత్వం పట్ల చులకన భావంతో చూసిన నాని.. అదే అదునుగా తమ్ముడు చిన్ని పార్టీ నాయకత్వానికి దగ్గరయ్యారు. తన సోదరుడు కేశినేని నాని బయటకు వెళ్లిపోయేలా చేశారు. ఇక్కడ కేశినేని నాని నిర్లక్ష్యం ఉంది. అదే సమయంలో తమ్ముడు చిన్ని చతురత ఉంది. అయితే వచ్చిన అవకాశాన్ని చిన్ని వినియోగించుకోవడం లేదు. అవకాశాన్ని దూరం చేసుకున్న నాని ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. అందుకే తమ్ముడు వ్యవహారంలో స్పందించలేదని తెలుస్తోంది. పరిస్థితుల ప్రభావంతో టిడిపికి దూరమైన నానిని ఇప్పుడు పార్టీలోకి రప్పించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలో కేశినేని నాని సైకిల్ ఎక్కడం ఖాయమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.