Kesineni Chinni And Kodali Nani: కూటమిలో ఇప్పుడు కొలికపూడి కాక రేపుతున్నారు. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వర్సెస్ కొలికపూడి అన్నట్టు ఉంది పరిస్థితి. అయితే తాజాగా కొలికపూడి సంచలన అంశాలను బయటపెట్టారు. ఇప్పటికీ కూటమిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తోందని.. దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే కూటమికి నష్టం అని తేల్చి చెప్పారు. అయితే ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు. ఇప్పుడు కొలికపూడి చెబుతోంది మరో ఎత్తు. ఆయనను అంత తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. ఎంతోమందికి పొలిటికల్ సైన్స్ పాఠాలు చెప్పి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా తీర్చిదిద్దిన ఘనత కొలికపుడిది. ఇప్పటివరకు ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లైన్లో మాట్లాడుతున్నారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అదే వైసీపీ మనుషులు కూటమి పార్టీలో ఉన్నారని సంచలన విషయాలను బయటపెట్టారు. ఇప్పుడు అవే హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇప్పటివరకు ఆయన పై హై కమాండ్ చర్యలు తీసుకుంటుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు హై కమాండ్ కె కొలికపూడి సూచనలు ఇస్తుండడం విశేషం.
* రాష్ట్రవ్యాప్తంగా ద్వారంపూడి మనుషులు..
వైసీపీ( YSR Congress ) హయాంలో ఒక వెలుగు వెలిగారు కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్. ఆయనది స్వతహాగా బియ్యం వ్యాపారం. అయితే రేషన్ మాఫియా నడుపుతున్నది ఆయనేనని ఆరోపణలు ఉన్నాయి. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఆయనపై విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇంతవరకు ఆయనపై ఎటువంటి చర్యలు లేవు. మొన్న ఆ మధ్యన కాకినాడలో ఒక షిప్ దొరికిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే ద్వారంపూడి చంద్రశేఖర్ పేరు బలంగా వినిపించింది. ఆయనపై ఎటువంటి కేసులు నమోదు కాలేదు. చర్యలు కూడా తీసుకోలేకపోయారు. తాజాగా కొలికపూడి ద్వారంపూడి చంద్రశేఖర్ మనుషులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నారని.. వారే రేషన్ బియ్యం మాఫియా ను నడుపుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు.. ఎంపీ కేశినేని నాని కార్యాలయంలో కూర్చొని దందాను నడుపుతున్నారంటూ కొలికపూడి వ్యాఖ్యానించడం విశేషం.
* కూటమిని ఇరకాటంలో..
ఎంపీ కేశినేని చిన్ని( ఎంపీ kesineni Chinni ) తన పేరు కొలికపూడి బయట పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అసెంబ్లీ టికెట్ కోసం తన వద్ద ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నారంటూ ఆరోపించారు కొలికపూడి. అక్కడ నుంచి వివాదం ప్రారంభం కాగా నిన్ననే కూటమి సమన్వయ సమావేశం పేరిట బలప్రదర్శనకు దిగారు చిన్ని. దాదాపు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలంతా హాజరయ్యారు. అయితే ఇప్పుడు కొత్త విషయాన్ని బయటపెట్టారు కొలికపూడి. కొడాలి నాని మనుషులు కేశినేని చిన్ని కార్యాలయంలో ఉండడాన్ని హైలెట్ చేశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ మనషులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నారని చెప్పడం ద్వారా పౌర సరఫరాల శాఖను తప్పుపట్టారు. ఆ శాఖను నిర్వర్తిస్తోంది జనసేన నేత నాదెండ్ల మనోహర్. తద్వారా చిన్ని కూటమి ద్వారా తనను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. అదే కూటమిని ఇరకాటంలో పెట్టగలిగారు కొలికపూడి. రాజకీయంగా బద్ధ శత్రువుగా ఉన్న కొడాలి నాని మనిషిని తెచ్చుకొని.. కేశినేని చిన్ని అవినీతికి పాల్పడుతున్నారని చెప్పడంలో సక్సెస్ అయ్యారు కొలికపూడి. దీంతో ఈ వివాదం యూటర్న్ తీసుకుంది. మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.