KCR And Jagan: తెలుగు రాష్ట్రాల్లో ( Telugu States ) రెండు పార్టీల విషయంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో కెసిఆర్ పార్టీ తన వైఖరి మార్చుకున్నట్లు స్పష్టం అవుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి విషయంలో ఈ రెండు పార్టీల భావన ఒకేలా ఉంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బిజెపిని శకునిలా అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రం పాలిట బిజెపి శాపంగా మారిందని చెప్పుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అయితే బిజెపి కార్యక్రమాల్లో అవినీతి జరిగిందని కొత్తగా వ్యాఖ్యలు చేస్తున్నారు. విశాఖలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన యోగా డే లో భారీ అవినీతి జరిగిందని చెప్పడం ద్వారా.. బిజెపి పై పరోక్ష పోరాటం ప్రారంభించిన టు అయింది. అయితే వీరిద్దరూ ఒకేసారి బిజెపి విషయంలో స్వరం మార్చడం హాట్ టాపిక్ అవుతోంది. ఇద్దరూ కలిసి ప్రణాళికలో భాగంగా అలా మాట్లాడి ఉంటారన్న అనుమానాలు ఉన్నాయి.
* రెండు పార్టీలది వింత పరిస్థితి..
ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఎన్డీఏ( National democratic Alliance ) అధికారంలో ఉండగా.. ప్రతిపక్ష ఇండియా కూటమి కొనసాగుతోంది. దాదాపు దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏదో ఒక కూటమి వైపు ఉండడం కనిపిస్తోంది. ఏపీకి చెందిన వైయస్సార్ కాంగ్రెస్, తెలంగాణకు చెందిన బిఆర్ఎస్ మాత్రం తటస్థ వైఖరితో ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణలో తనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఉండటంతో కేసిఆర్ తటస్థంగా ఉండాల్సి వచ్చింది. ఏపీలో అయితే తనకు ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ అంటే జగన్మోహన్ రెడ్డికి గిట్టదు. అలాగని బిజెపి గూటికి వెళ్లలేవు ఈ రెండు పార్టీలు. అలా వెళ్లిన మరుక్షణం సంప్రదాయ ఓటు బ్యాంకు అనేది పూర్తిగా కనుమరుగు అవుతుంది. అందుకే అటు బీజేపీ లోకి వెళ్లలేక.. ఇటు కాంగ్రెస్ కూటమిలోకి రాలేక సతమతం అవుతున్నాయి.
* కేసులకు భయపడి..
అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీలు అధికారానికి దూరమయ్యాయి. సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి( Bhartiya Janata Party) వ్యతిరేకంగా మారితే కేసుల రూపంలో ఇబ్బందులు ఎదురవుతాయని ఆ పార్టీలకు తెలుసు. అయితే ఏదో ఒక కూటమి కాకుండా ఇద్దరు కలిసి ఉండాలన్న ఆలోచనకు వచ్చినట్టు ఉన్నారు కెసిఆర్, జగన్. ఇటీవల మళ్ళీ యాక్టివ్ అయిన కేసీఆర్ బిజెపి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చంద్రబాబుపై కూడా విమర్శలు చేశారు. దానిని ఆహ్వానిస్తున్నారు వైసీపీ నేతలు. ఒకే ప్రణాళికతో వెళ్లినట్లు కనిపిస్తున్నాయి రెండు పార్టీలు. ఏదైనా కొత్త కూటమి దిశగా ఆలోచన చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఎన్నికల కు ముందు కెసిఆర్ తృతీయ ఫ్రంట్ అంటూ హడావిడి చేశారు. తెలంగాణలోనే దెబ్బ తినేసరికి ఆ ప్రయత్నాన్ని మానుకున్నారు. అయితే ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ లేని తృతీయ ఫ్రంట్ కు వీళ్ళిద్దరూ ప్రయత్నిస్తున్నారా? అనుమానాలు కలుగుతున్నాయి. కానీ ఆ పరిస్థితి ప్రస్తుతం దేశంలో లేదు. ఇండియా కూటమికే దిక్కులేదు అంటే మరోకూటమి అనేది సాహసమే అవుతుంది. పైగా కాంగ్రెస్ పార్టీ లేని మరోకూటమి అసాధ్యం కూడా.