Kallu Geetha Workers: ఏపీ ప్రభుత్వం ( AP government) నూతన బార్ల పాలసీపై దృష్టి పెట్టింది. ఆగస్టు 30తో బార్ల పాలసీ ముగియనున్న నేపథ్యంలో అంతకంటే ముందే బార్లకు అనుమతులు ఇవ్వనుంది. అయితే వేలం ద్వారా కాకుండా.. లాటరీ ద్వారా బార్లను కేటాయించేందుకు.. వారికి లైసెన్సులు జారీ చేసేందుకు నిర్ణయించింది. వైసిపి హయాంలో బార్ల పాలసీ రూపొందించారు. అప్పట్లో ప్రభుత్వం మద్యం దుకాణాల్లో ప్రీమియం బ్రాండ్లు లేకుండా చేశారు. కేవలం జే బ్రాండ్ మద్యం మాత్రమే దొరికేది. ఆపై బార్ల నిర్వహణ ఖర్చును, దరఖాస్తు రుసుమును అమాంతం పెంచేసింది వైసిపి ప్రభుత్వం. దీంతో ప్రీమియం బ్రాండ్ల కోసం బార్ల వైపు వెళ్లే వారికి చుక్కలు కనిపించేవి. అమ్మకాలు లేక బార్ల యజమానులు నష్టాల్లోకి వెళ్లిపోయారు. అందుకే ఈసారి బార్ల పాలసీలో ఎవరు నష్టపోకుండా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది.
Also Read: విశాఖలో వైసీపీకి మరో ముప్పు!
మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం..
బార్ల పాలసీపై( bar policy ) మంత్రివర్గ ఉప సంఘం కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. మరింత సరళతరమైన విధానం తీసుకురావాలని భావిస్తోంది. మరోవైపు కల్లుగీత కార్మికులకు ఏకంగా 10% బార్లను కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు సైతం సూత్రప్రాయంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది వందలకు పైగా బార్లు ఉన్నాయి. అయితే వాటిది 1000 కి పెంచాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అదే జరిగితే గీత కార్మికులకు ఏకంగా ఓ 100 బార్లు దక్కే అవకాశం ఉంది.
అప్పట్లో షాపులు కూడా..
టిడిపి కూటమి( TDP Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత లైసెన్సుల జారీ ద్వారా మద్యం దుకాణాలకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో కూడా 10% షాపులను కల్లుగీత కార్మికులకు కేటాయించింది ప్రభుత్వం. కల్లుగీత వృత్తిలో ఉన్నవారు ఆర్థికంగా ఎదగలేక పోతున్నారు. అదే సమయంలో కళ్ళు లభ్యత కూడా తగ్గిపోతోంది. తాటి చెట్లు కూడా తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలో ఇంకా ఆ వృత్తిని నమ్ముకొని ఉన్నవారికి ఈ అవకాశం కల్పించడం ద్వారా.. ఆర్థిక భద్రత కల్పించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అప్పట్లో మద్యం దుకాణాలు కేటాయించినప్పుడు తక్కువ లైసెన్స్ ఫీజులు నిర్ణయించారు. ఇప్పుడు బార్ల విషయంలో సైతం అదే అమలు చేయనున్నారు.
Also Read: ఏపీలోని ఆ జిల్లాలకు బిగ్ అలెర్ట్..!
ఆర్థికంగా ప్రోత్సహించాలని..
సాధారణంగా కల్లుగీత కార్మికులుగా శ్రీశయన, గౌడ, సెగిడి, సొండి కులాల వారు ఉన్నారు. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఆ పరిస్థితిని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. బార్లకు ఎలా అనుమతులు ఇవ్వాలి అన్నదానిపై మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం తీసుకోనుంది . ఆ ప్రకారం మరింత సరళమైన నిబంధనలతో గీత కార్మికులకు లైసెన్సులు ఇచ్చే అవకాశం ఉంది. అయితే గతంలో మద్యం దుకాణాల విషయంలో గీత కార్మికులకు కొన్ని షాపులు కేటాయించగా.. వాటిని ఇతర వర్గాలు లాక్కున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా బార్ల విషయంలో అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటేనే.. ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది.