Homeఆంధ్రప్రదేశ్‌MP Kalisetti Appalanaidu: ఆయన 'సామాన్యుల' ఎంపీ!

MP Kalisetti Appalanaidu: ఆయన ‘సామాన్యుల’ ఎంపీ!

MP Kalisetti Appalanaidu: శ్రీకాకుళం జిల్లా( Srikakulam district ) నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఎంతోమంది ఎదిగారు. అటువంటి వారిలో ముందు వరుసలో ఉంటారు దివంగత నేత కింజరాపు ఎర్రం నాయుడు. తెలుగుదేశం పార్టీ తరఫున బలమైన నాయకత్వాన్ని చాటి చెప్పే వ్యక్తిగా, నిబద్ధత కలిగిన రాజకీయవేత్తగా ఎర్రంనాయుడు గుర్తింపు సాధించారు. ఏపీ ప్రజలతో పాటు రాజకీయ ప్రముఖులకు ఎంతో సుపరిచితుడుగా నిలిచారు. అలానే కిందిస్థాయి నుంచి మరో నేత ఎదిగారు. ఎదిగే క్రమంలో ఒదిగి ఉంటున్నారు. ఆయనే విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. తెలుగుదేశం పార్టీ వీరాభిమానిగా ఉంటూ అంచలంచెలుగా ఎదిగిన ఆ వ్యక్తి.. సిక్కోలు నుంచి ఢిల్లీ వరకు పయనం సాగించారు. ఢిల్లీ గడ్డపై సిక్కోలు ఖ్యాతిని ఇనుమడింప చేస్తున్నారు. క్రమశిక్షణతో, అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతున్నారు.

టిడిపి శ్రేణుల మది నిండా..
తెలుగుదేశం ( Telugu Desam) పార్టీలో ప్రతి నేతకు ఏదో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. కానీ సగటు టిడిపి అభిమాని మనసులో మాత్రం కలిశెట్టి అప్పలనాయుడు ఉంటున్నారు. ఎందుకంటే ఆయన ఎదిగిన తీరు అద్భుతం. ఆయన వెళుతున్న మార్గం అనితర సాధ్యం. ఎంత ఎత్తుకు ఎదిగిన తాను ఒక టిడిపి సైనికుడిని మాత్రమే అన్నట్టు ఆయన ప్రయాణం కొనసాగుతోంది. ఎంపీగా ఎన్నికై పార్లమెంటుకు వెళ్లిన తొలిసారి సైకిల్ పై వెళ్లి అందరిని ఆశ్చర్యపరిచారు. పసుపు దుస్తుల్లో సైకిల్ పై వెళ్ళాలని తీసుకున్న నిర్ణయం ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఉప్పొంగిపోయేలా చేసింది. పార్లమెంటులో 100% అటెండెన్స్ ఉన్న ఏకైక ఎంపీ అప్పలనాయుడు. పార్లమెంటు సమావేశాలు ఉంటే ఢిల్లీలోనే ఉంటారు. లేకుంటే తన పార్లమెంటరీ స్థానం పరిధిలో ఉంటారు.

ప్రజల కోసం వదులుకునేందుకు సిద్ధం..
ఒక జర్నలిస్టుగా వచ్చి రాజకీయాల్లో ఈ స్థానానికి చేరుకున్నారు అప్పలనాయుడు( apala Naidu ). కానీ ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆలోచన ఆయనది. సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన తన ఎంపీ జీతభత్యాలను తృణప్రాయంగా ప్రజల కోసం ఖర్చు చేస్తుంటారు. ఒకసారి విజయవాడ వరద బాధితులకు.. ఇంకోసారి అన్నా క్యాంటీన్లకు.. మరోసారి చేనేత కార్మికులకు ఇలా తన జీతాన్ని ఇచ్చిన మహోన్నత నేత అప్పలనాయుడు. రాజకీయంగా ఆయన పై భిన్నాభిప్రాయాలు ఉన్నవారు సైతం ఔరా అప్పలనాయుడు అనేలా.. ఆశ్చర్యపోయేలా ఆయన చర్యలు ఉన్నాయి.

పార్టీ అంటే దేవాలయం..
ఎంపీ అప్పలనాయుడు దృష్టిలో తెలుగుదేశం పార్టీ అంటే దేవాలయం. ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబు( CM Chandrababu) అంటే దేవుడిలా కొలుస్తారు. తన సొంత గ్రామంలో ఎన్టీఆర్కు గుడి కట్టించారు అంటే అప్పలనాయుడు ఎలాంటి ఆలోచనలో ఉన్నారు అర్థం చేసుకోవచ్చు. అశోక్ గజపతిరాజు లాంటి నేత పోటీ చేసిన పార్లమెంటు సీట్లో అప్పలనాయుడు బరిలో దిగారు. రాజకీయ ప్రత్యర్థులు ఎంతో చులకనగా చూశారు. ఇక తమదే విజయం అన్నట్టు భావించారు. కానీ రాజుల స్థానం నుంచి సామాన్యుడిగా బరిలో దిగిన అప్పలనాయుడు గెలిచిన తీరు.. గెలిచిన తర్వాత ఆయన వ్యవహరిస్తున్న తీరును చూసి ప్రతి ఒక్కరు అభిమానిస్తున్నారు. ఎంపీ అంటే ఇలా ఉండాలి కదా అనేలా అప్పలనాయుడు తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు. తన నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తున్నారు. రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య వారధిగా పనిచేస్తున్నారు. నిజంగా కలిశెట్టి అప్పలనాయుడు సాధారణ ఎంపీ కాదు.. ఒక్క మాటలో చెప్పాలంటే సామాన్య ఎంపీ. అటువంటి వారిని గుర్తించి చట్టసభలకు పంపించాల్సిన గురుతర బాధ్యత ప్రజలపై ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular