Pakistan Army Chief Asim Munir: హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ రెండేళ్లుగా పాలస్తీనాపై దాడులు చేస్తోంది. వారికి మద్దతుగా నిలిచిన దేశాలనూ ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తోంది. అమెరికా ఇజ్రాయెల్‌కు అండగా ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా హమాస్‌ను పూర్తిగా అంతం చేయడానికి అమెరికా సిద్ధమైంది. ఈ క్రమంలో పాకిస్తాన్ సైన్యాన్ని పాలస్తీనాకు పంపాలని ఆదేశించింది. ఇది ఇప్పుడు పాకిస్తాన్ ఫీల్డ్ మార్షన్ ఆసిమ మునీర్‌కు తలనొప్పిగా మారింది. ఇటీవలే త్రివిధ దళాల అధిపతిగా బాధ్యతలు చేపట్టిన ఆసిమ్.. పాకిస్తాన్ నిర్ణయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఒకవైపు హమాస్‌కు ముస్లిం సమాజం బలంగా మద్దతు ఇచ్చే ఈ సంస్థకు వ్యతిరేకంగా సైన్యాన్ని పంపాలని ఒత్తిడి పెరుగుతోంది. పాకిస్తాన్ సైనిక నేతృత్వం ఈ అభ్యర్థనకు సానుకూలంగా స్పందిస్తోంది, కానీ పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్త అల్లర్ల ప్రమాదం
హమాస్‌పై దాడులు ప్రారంభిస్తే విదేశాల్లో నివసిస్తున్న పాకిస్తానీలు ఉద్రిక్తులు సృష్టించే అవకాశం ఎక్కువ. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అశాంతి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి దేశ యువతను రెచ్చగొట్టి, అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్‌కు ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్వదేశంలో సివిల్ వార్?
హమాస్‌పై దాడికి పాకిస్తాన్ ఆర్మీ వెళితే పాకిస్తాన్‌లోనూ సివిల్ వార్ ప్రారంభమయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అల్లర్లు జరగుతున్నాయి. సైనిక చీఫ్ ఆసిమ్ మునీర్ ఈ పరిణామాలను గ్రహించి, అమెరికాకు తన ఆందోళనలు తెలియజేస్తున్నాడు. దేశాంతరాల్లో ఉద్రిక్తతలు, ఆంతరిక విభజనలు పెరిగితే స్థిరత్వం పూర్తిగా కుప్పకూలవచ్చు.
రాబోయే వారాల్లో పాకిస్తాన్ సైన్యం పాలస్తీనాలో అడుగుపెట్టే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే దేశీయ ఒత్తిడి తీవ్రంగా పెరుగుతోంది. అమెరికా–పాక్ సంబంధాలు దెబ్బతింటే ఆర్థిక సహాయాలు ఆగవచ్చు. ఐక్యపూర్వక వ్యూహం లేకపోతే పాకిస్తాన్ రాజకీయ, సైనిక స్థితి మరింత సంక్లిష్టమవుతుంది.