Kadapa TDP Politics: తెలుగుదేశం( Telugu Desam) పార్టీలో దూకుడు కలిగిన మహిళల్లో రెడ్డప్ప గారి మాధవి రెడ్డి ముందుంటారు. కడప అడ్డాలో ఏకంగా డిప్యూటీ సీఎం పై గెలిచి సత్తా చాటారు. వైసీపీ నేతలకు సవాల్ చేస్తూ రాష్ట్రస్థాయిలో సంచలనంగా మారారు. చాలా దూకుడుగా ఉంటూ జిల్లాలో పార్టీకి మైలేజ్ తీసుకొచ్చారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. చంద్రబాబు ఎప్పటికప్పుడు కట్టడి చేస్తున్న ఫలితం లేకపోయింది. అయితే తాజాగా షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. మంత్రి నారాయణ ఫిర్యాదు మేరకు ఏకంగా ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి రెడ్డి ప్రధాన అనుచరుడిపై వేటు వేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడంతో కడప టిడిపిలో ఒక్కసారిగా సంచలనంగా మారింది. అనుచరుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయాలని హైకమాండ్ ఎమ్మెల్యేకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
Also Read: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..
కడపలో రికార్డు బ్రేక్..
కడప ( Kadapa ) అంటే వైయస్సార్ కుటుంబ హవా ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో సైతం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కడపలో మాత్రం వైయస్ కుటుంబానిదే ఆధిపత్యం. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఏర్పాటు చేశాక కూడా అదే హవా కొనసాగిస్తూ వచ్చారు. అయితే మొన్నటి ఎన్నికల్లో మాత్రం కూటమి సక్సెస్ అయ్యింది. పది అసెంబ్లీ స్థానాలకు గాను మూడు స్థానాలకు మాత్రమే వైసిపి పరిమితం అయింది. అన్నింటికీ మించి కడప అసెంబ్లీ నియోజకవర్గాన్ని టిడిపి గెలుచుకోవడం రికార్డ్ బ్రేక్ చేసింది. దానికి కారణం మాత్రం రెడ్డప్ప గారి మాధవి రెడ్డి. మహిళా నేతగా ఉన్నా చాలా దూకుడు కనబరిచారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా నిలబడ్డారు. అదే దూకుడుతో ఎన్నికల బరిలో నిలిచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి అనేక రకాల వివాదాలు ఆమె చుట్టూ అల్లుకుంటున్నాయి.
Also Read: ఏపీలో కొత్త జిల్లాలు?
ప్రధాన అనుచరుడిపై వేటు..
ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి రెడ్డి( Madhavi Reddy ) పిఏ గా వహీద్ ఉండేవారు. ఆయనపై అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ మహిళను లోబరుచుకొని రెండో పెళ్లి చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరో ఇద్దరు యువతులను సైతం మోసం చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో మాధవి రెడ్డి స్పందించారు. వహీద్ను విధుల నుంచి తొలగించారు. ఆయనపై పోలీస్ చర్యలకు ఆదేశించారు. అయితే కడపలో మహానాడు సక్సెస్ చేయడంలో మాధవి రెడ్డి పాత్ర ఉంది. అయితే అదే మహానాడు కోసం అంటూ విద్యాసంస్థల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆమె అనుచరుడు తిరుమలేష్ పై ఆరోపణలు వచ్చాయి. చివరకు మంత్రి నారాయణ సొంత విద్యాసంస్థల నుంచి కూడా వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం మంత్రి నారాయణ కు తెలియడంతో ఆయన టిడిపి హై కమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో తిరుమలేష్ పై టిడిపి హై కమాండ్ వేటు వేసింది. ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి రెడ్డికి షాక్ తగిలింది. దీనిపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి.