spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Avinash Reddy: కడప నుంచి అవినాష్ రెడ్డి ఔట్!

Avinash Reddy: కడప నుంచి అవినాష్ రెడ్డి ఔట్!

Avinash Reddy: కడప విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. కడప ఎంపీ సీటు విషయంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డికి ఈసారి మొండి చేయి చూపుతారు అన్న టాక్ నడుస్తోంది.. ముందుగా ఇప్పుడు ఆయనతో రాజీనామా చేయించి.. జగన్మోహన్ రెడ్డి ఉపఎన్నికకు వెళ్తారు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం తన చుట్టూ ఉన్న కేసుల దృష్ట్యా.. ఢిల్లీలో ఉంటేనే తన ప్రయత్నాలు అన్నట్టు జగన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డికి ఈడి నోటీసులు ఇస్తుంది అన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే జగన్ చుట్టూ ఉచ్చు బిగిసినట్టే. అది జగన్మోహన్ రెడ్డికి సైతం తెలుసు. అందుకే ఇప్పుడు కేంద్ర పెద్దలను కలవాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రధానితో పాటు హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అది ఎంత మాత్రం వర్కౌట్ కావడం లేదు. అందుకే జగన్ ఆలోచనలో పడ్డారు. మున్ముందు తన అక్రమాస్తుల కేసులు బయటకు వస్తే ఎలా అడుగులు వేయాలి అనే దానిపై తీవ్రంగా ఆలోచిస్తున్నారు.

* ఢిల్లీలో అడుగు పెట్టాలని..
ప్రస్తుతం కడప ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని విభేదించి వైసిపి ఏర్పాటు చేసినప్పుడు అదే కడప నుంచి ఎంపీగా గెలిచారు జగన్. నిత్యం ఢిల్లీలో ఉంటూ లాబీయింగ్ చేసుకొని.. తన కేసుల విషయంలో బెయిల్ వచ్చేలా చేసుకున్నారు. అప్పట్లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వంతో స్నేహం చేసేందుకు తన ఎంపీ పదవి ఆయనకు కలిసి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ పాత కేసులన్నీ తెరమీదకు రానున్నాయి. గత పుష్కర కాలానికి పైగా జగన్ బెయిల్ పై ఉన్నారు. ఇప్పుడు గాని ఆ బెయిల్ రద్దు అయితే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని జగన్ కు తెలుసు. అందుకే ఢిల్లీలో లాబీయింగ్ చేసేందుకు గాను ఇప్పుడు ఎంపీ పదవిని ఆయన కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డిని రాజీనామా చేయాలని జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివేకానంద రెడ్డి హత్య కేసు అంశంతో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి నష్టం జరిగింది. సొంత కుటుంబమే తన తండ్రిని చంపిందని సునీత ఆరోపించారు. చంపిన వారికి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహం ఉందంటూ సంచలన ఆరోపణలు కూడా చేశారు. ఇవి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎంతగానో నష్టం చేకూర్చాయి. మొన్నటి ఎన్నికల్లో కడపలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం అదే. అందుకే మరోసారి అవినాష్ రెడ్డిని ఎంపీగా పోటీ చేయిస్తే ప్రతికూల ఫలితం వస్తుందన్న ఆందోళన జగన్లో ఉంది. అందుకే ఈసారి అవినాష్ రెడ్డిని పోటీ నుంచి తప్పిస్తారని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఒక ఫార్ములా తో ముందుకు వెళుతున్నారు. అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి.. బైపోల్స్ వస్తే పోటీ చేయాలని భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అలా ఢిల్లీకి వెళ్లి అక్కడి పెద్దలతో లాబీయింగ్ చేసుకోవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా తెలుస్తోంది.

*భారతి తో పోటీ..
2029 సార్వత్రిక ఎన్నికల నాటికి తిరిగి జగన్ పులివెందుల నుంచి.. కడప పార్లమెంట్ స్థానం నుంచి అవినాష్ రెడ్డికి కాకుండా తన భార్య భారతి రెడ్డిని రంగంలోకి దించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. భారతీ అయితేనే తట్టుకోగలరు అనేది ఒక అంచనా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల మరోసారి పోటీ చేసే ఛాన్స్ ఉంది. కూటమి బలంగా ఉంది. అవినాష్ రెడ్డి అయితే మరోసారి వివేకానంద రెడ్డి హత్య అంశం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఇన్ని ప్రమాదాల నడుమ తన భార్యను రంగంలోకి దించి.. అవినాష్ రెడ్డి ని పక్కన పెడతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...
Vijay Deverakonda Vs Naveen Polishetty

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో...
Nagababu Jabardasth

Nagababu Jabardasth: ‘జబర్దస్త్’ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగబాబు ఒక్కో ఎపిసోడ్ కి తీసుకునే రెమ్యూనరేషన్...

Nagababu Jabardasth: గత 13 సంవత్సరాల నుండి ఎలాంటి విరామం లేకుండా ఈటీవీ లో దిగ్విజయంగా సాగుతున్న షో ఏదైనా ఉందా అంటే , అది 'జబర్దస్త్' మాత్రమే. ఈ బిగ్గెస్ట్...
Oktelugu Epaper