Jyotula Nehru : సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ( Jyo Tula Nehru ) అసంతృప్తితో ఉన్నారా? సీనియారిటీకి తగిన గుర్తింపు లేదని బాధపడుతున్నారా? అందుకే తరచూ అసంతృప్తి స్వరం వినిపిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. సుదీర్ఘకాలం రాజకీయం చేసిన మంత్రి పదవి ఆయనకు దక్కకపోవడం చాలా లోటు. ఈసారి జగ్గంపేట నుంచి గెలవడంతో మంత్రి పదవి ఇస్తారని భావించారు. ఇవ్వలేదు సరి కదా సరైన గుర్తింపు లేకుండా పోతోందని ఆయన చాలా ఆవేదనతో ఉన్నారు. చాలా వేదికల వద్ద ఇదే విషయాన్ని చెప్తున్నారు. తనలో ఉన్న నిర్వేదాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో అందరి చూపు జ్యోతుల నెహ్రూ పై పడుతోంది.
Also Read : ఆ జిల్లా టిడిపి సీనియర్లలో అసంతృప్తి.. కారణం అదే!
* సీనియర్ మోస్ట్ లీడర్
గోదావరి జిల్లాల్లో( Godavari district ) జ్యోతుల నెహ్రూ సీనియర్ మోస్ట్ లీడర్. తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 1994లో తొలిసారిగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1999లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. 2009లో చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరి…ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పుడు కూడా ఓటమి చవిచూశారు. 2014 ఎన్నికల కు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కానీ గెలిచిన కొద్ది రోజులకే టిడిపిలోకి ఫిరాయించారు. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో గెలిచిన ఆయన మంత్రి పదవి ఆశించారు. కానీ దక్కకపోయేసరికి చాలా బాధపడ్డారు.
* టీటీడీ బోర్డు మెంబర్ గా అవకాశం..
మంత్రి పదవి లేకపోయేసరికి బాధపడుతున్న జ్యోతుల నెహ్రూ కూటమి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం( TTD bord member) బోర్డు సభ్యుడుగా నియమించింది. అయితే జ్యోతుల నెహ్రూ మంత్రిని కాలేకపోయానని బాధపడుతుంటారు. సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న తనను గుర్తించడంలో చంద్రబాబు ఎందుకో వివక్ష చూపుతున్నారని బాధపడుతున్నారు. అయితే ఆయన సీనియారిటీకి తగ్గ గౌరవం కూడా లభించడం లేదు. ఆ మధ్యన అసెంబ్లీలో సైతం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుతో వాగ్వాదానికి దిగారు. జిల్లా సమావేశాల్లో సైతం నిత్యం తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇది ఇలానే కొనసాగితే మాత్రం జ్యోతుల నెహ్రూ టిడిపిలో ఉంటారా? ఉండరా? అన్నది అనుమానమే.