spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Jr NTR Political Future: జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ ముగిసినట్టే

Jr NTR Political Future: జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ ముగిసినట్టే

Jr NTR Political Future: తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చాయి. పివికే అధినేత విజయ్ అనూహ్య విజయం దక్కించుకున్నారు. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానున్నారు. పార్టీ ఏర్పాటు చేసిన రెండు సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చి రికార్డ్ సృష్టించారు. ఇండియన్ సినిమా హిస్టరీలో నందమూరి తారక రామారావు తర్వాత అంతటి ఘనత సాధించారు. విజయ్ గెలుపుతో దేశంలో మిగతా సినీ నటులు రాజకీయ అరంగేట్రం చేసి.. రాజకీయ పార్టీలు ఏర్పాటు చేస్తారన్న టాక్ ప్రారంభం అయింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తరువాత ఛాన్స్ జూనియర్ ఎన్టీఆర్ అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే పొలిటికల్ ఎంట్రీ కి జూనియర్ ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నారా అంటే మాత్రం సమాధానం దొరకదు. మునుపటి పరిస్థితి కూడా తెలుగుదేశంలో లేదు. అంతా సాఫీగా జరిగిపోయింది అధికార మార్పిడి. ఇప్పుడు అసలు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన పార్టీలో లేదు. అంతలా మారిపోయింది స్వరూపం.

* అప్పట్లో తారక్ ను తేవాలని డిమాండ్
తెలుగుదేశం ( Telugu Desam) పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ను తెచ్చి యాక్టివ్ చేయాలన్నది సీనియర్ల అభిప్రాయమే కాదు. మెజారిటీ పార్టీ శ్రేణులు కూడా దానినే కోరుకున్నాయి. అయితే అది ఇప్పుడు కాదు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ స్వరం వినిపించింది. అందుకు కారణం లోకేష్. ఆయన అప్పట్లో అంత పరిణితి చెందలేదు. అందుకే చంద్రబాబు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆప్షన్ గా ఉండేది పార్టీ శ్రేణులకు. 2019 ఎన్నికల్లో టిడిపి ఓడిపోయిన తరువాత జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కూడా నేతలు ఒక పద్ధతి ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి తెచ్చి చంద్రబాబును ఇరకాటంలో పెట్టారు. ఈ విషయంలో మాత్రం చంద్రబాబు ఎంతో సంయమనంతో వ్యవహరించారు. చాలా సహనంతో కూడా గడిపారు.

* అప్పట్లో రాజకీయ ఆసక్తి..
గతంలో జూనియర్ ఎన్టీఆర్ హవ భావం.. ఆయన నుంచి వచ్చే సంకేతాలు రాజకీయ ఆసక్తిని నింపేవి. రాజకీయాల పట్ల ఆయన ఆసక్తితో ఉన్నారనే బలమైన సంకేతం ప్రజలకు వచ్చింది. కానీ రాజకీయాల కంటే సినిమా ముద్దు అంటూ.. తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ఏర్పడిన తర్వాత చూసుకోవచ్చు అన్నట్టు వ్యవహరిస్తూ వచ్చారు జూనియర్ ఎన్టీఆర్. కానీ 2024 ఎన్నికల్లో టిడిపి కూటమి గెలుపుతో మొత్తం స్వరూపమే మారిపోయింది. లోకేష్ తనకంటూ ఒక ముద్ర చాటుకుంటున్నారు రాజకీయాలతో పాటు పాలనలో. జాతీయస్థాయిలో కూడా సరైన గుర్తింపు పొందారు. ఫుల్ మార్కు రాజకీయాలు కనిపిస్తున్నాయి లోకేష్లో. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అయిపోయారు. ఇక తెలుగుదేశం పార్టీలో ఆయనకు తిరుగులేదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వస్తాం అన్న ఆహ్వానించే వారు లేరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంతలా పార్టీపై పట్టు సాధించారు లోకేష్. మంచి వాగ్దాటితో పాటు చరిష్మ ఉన్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి రాణించడం కూడా అంత సులువు అని చెప్పలేము. అలాగని సాధ్యం కాదు అని చెప్పలేం. కానీ ఆయనకు తెలుగుదేశం పార్టీలో మాత్రం మునుపటి పరిస్థితి లేదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Andhra Pradesh Investments: ఏపీకి భారీ పెట్టుబడులు!

Andhra Pradesh Investments: రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఉత్తరాంధ్రకు వరుసగా ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లు వచ్చాయి....

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....

AP MLC Elections: ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరు నేతలను ఫిక్స్ చేసిన చంద్రబాబు!

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభం అయింది. గవర్నర్ కోటా కింద ఎంపికైన జాకీయా ఖానం, పండుల రవీంద్రబాబు ఈనెల 28న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో...

Roja: తీవ్ర నిర్ణయం దిశగా రోజా!

Roja: ఇటీవల మాజీ మంత్రి రోజా పెద్దగా కనిపించడం లేదు. రాజకీయంగా యాక్టివ్ గా లేరు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చే కంటెంట్ తో సోషల్ మీడియాలో పెట్టే ట్విట్లకు పరిమితం అవుతున్నారు....

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...
Oktelugu Epaper
Exit mobile version