Homeఆంధ్రప్రదేశ్‌Jonty Rhodes meets Nara Lokesh: నారా లోకేష్ రెండేళ్లలోనే.. ఐదేళ్లలో జగన్ ఒక్కసారీ ఇలా...

Jonty Rhodes meets Nara Lokesh: నారా లోకేష్ రెండేళ్లలోనే.. ఐదేళ్లలో జగన్ ఒక్కసారీ ఇలా చేయలేదు..

Jonty Rhodes meets Nara Lokesh: రాజకీయ నాయకులు అస్తమానం రాజకీయాలు మాత్రమే కాదు.. అప్పుడప్పుడు ప్రజలకు పనికి వచ్చే పని కూడా చేయాలి. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలి. అదిగో అప్పుడే ఆ నాయకులు గొప్పగా ఎదుగుతారు. ఓటు వేసిన ప్రజల ఆత్మగౌరాన్ని మరింత గొప్పగా చాటుతూ ఉంటారు.. అటువంటి నాయకులు ఎప్పటికీ కూడా ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటారు. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఇదే విధంగా అనుకుంటున్నారు. మేము ఓటు వేసింది సమర్థవంతమైన నాయకుడికి.. అతని నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని విస్తరింపజేస్తుందని అనుకుంటున్నారు.

గ్లోబల్ ఏపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నారు. ఆయన అమెరికాలోని అత్యంత పేరుపొందున విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువులు చదివారు. ఇంగ్లీష్ మీద ఆయనకు విపరీతమైన పట్టు ఉంటుంది. తెలుగులో కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ.. ఇప్పుడు పూర్తిస్థాయిలో పట్టు సాధించారు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఏపీ రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. గ్లోబల్ ఏపీ అంటూ పెట్టుబడులు.. ఇంకా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

క్రీడల వైపు కూడా
నారా లోకేష్ కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఖాళీ దొరికితే క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఇటీవల విశాఖపట్నంలో క్రీడా పాలసీ గురించి పేరుపొందిన మహిళ క్రికెటర్లతో ఆయన మాట్లాడారు. వారి మనసులో ఉన్న అభిప్రాయాలను తెలుసుకున్నారు. వాటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో క్రీడాకారులకు సరైన విధంగా రిజర్వేషన్ కల్పించి ఉద్యోగాలు లభించేలా చేశారు.

లెజెండరీ క్రికెటర్లతో..
లెజెండరీ క్రికెటర్లతో నారా లోకేష్ తరచూ మాట్లాడుతూ ఉంటారు. ఇటీవల సచిన్ తో మాట్లాడి.. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ఏం చేయాలో తెలుసుకున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్.. లెజెండ్ ఫీల్డర్ జాండి రోడ్స్ ను కలిశారు లోకేష్. ఆంధ్రప్రదేశ్లో క్రీడలు.. యువకుల కోసం అవకాశాల సృష్టి.. క్రీడారంగంలో చేపట్టాల్సిన ఆవిష్కరణల గురించి చర్చించారు. దీనికి సంబంధించిన విషయాలను లోకేష్ తన సామాజిక మాధ్యమా ఖాతాల ద్వారా పంచుకున్నారు.

“ఇది చాలా గొప్ప అవకాశం. అంతర్జాతీయంగా గొప్ప విధానాలను అవలంబించాలని భావిస్తున్నాం. రాబోయే తరానికి సంబంధించి అవకాశాలను సృష్టించడానికి చర్చించాం. ప్రపంచ స్థాయిలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్రీడల ముఖ ద్వారం గా తీర్చి దిద్దడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.. జాంటీ రోడ్స్ తన స్ఫూర్తివంతమైన అనుభవాన్ని మార్చ పంచుకున్నారు. ఆయనను కలుసుకోవడం చాలా గొప్ప విషయమని” లోకేష్ పేర్కొన్నారు.

ఐదు సంవత్సరాలు పరిపాలించిన జగన్ ఏనాడు కూడా ఈ స్థాయిలో మాజీ క్రికెటర్లను కలవలేదని.. ఏపీ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కృషి చేయలేదని టిడిపి నేతలు అంటున్నారు. చివరికి ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో దారుణంగా అవినీతికి పాల్పడ్డారని.. క్రీడల్లో ప్రతిభ చాటిన వారిని గుర్తించలేదని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి లోకేష్ ను చూసి నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular