Jeevi Reddy
Jeevi Reddy : జీవీ రెడ్డి రాజీనామా నేపథ్యంలో ఏపీ రాజకీయాలలో సంచలనం నమోదయింది. ప్రతిపక్ష వైసిపి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలుపెట్టింది.. అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్నారని.. దానిని ప్రశ్నించినందుకే జీవి రెడ్డికి పొమ్మన లేక పొగ పెడుతున్నారని ఆరోపించింది. జీవి రెడ్డి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఓ మీడియా అధినేత సోదరుడి కుమారుడు వ్యవహార శైలి కూడా ప్రతిపక్ష వైసిపి బయటపెట్టింది.. ఆయన వల్లే జీవి రెడ్డి బయటకు వెళ్లారని.. జీవి రెడ్డి నిష్పక్షపాతంగా వ్యవహరించినందు వల్లే ఆయనను బయటకు పంపించారని ఆరోపించింది. దీనిని టిడిపి ఖండించినప్పటికీ.. జీవి రెడ్డి చేసిన రాజీనామా టిడిపికి మైనస్ పాయింట్ గా మారింది. జీవి రెడ్డి రాజీనామాను సమర్ధించుకోలేక టిడిపి శ్రేణులు తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి. ఓ వర్గం మీడియా కూడా జీవి రెడ్డి రాజీనామాను టిడిపి అధిష్టానం చేసుకున్న కర్మ ఫలితమని వ్యాఖ్యానించింది. దీంతో తెలుగుదేశం పార్టీ పెద్దలు జీవి రెడ్డి రాజీనామా పై నోరు విప్పని పరిస్థితి నెలకొంది.
Also Read : చిన్నోళ్లు అందరూ చలికి తట్టుకోలేకపోతున్నారు.. ఈ వయసులో “బాబు” డ్రెస్ చూడండి!
సంచలన ట్వీట్
రాజీనామా తర్వాత తాను రాజకీయాల్లో ఉండనని.. న్యాయవాద వృత్తిలోనే కొనసాగుతానని జీవి రెడ్డి స్పష్టం చేశారు. అయినప్పటికీ ఓవర్గం మీడియా జీవి రెడ్డి రాజీనామా విషయాన్ని పదేపదే గెలకడం మొదలుపెట్టింది. కొన్ని విషయాలను ఈ సందర్భంగా బయటపెట్టింది. అయితే అవి నమ్మబుల్ గానే ఉండడంతో జీవి రెడ్డి రాజీనామా వెనుక కూటమి ప్రభుత్వంలోని ఓ కీలక నాయకుడు ఉన్నాడని ప్రచారం జరిగింది.. అయితే దీనిని కూటమి ప్రభుత్వ పెద్దలు ఖండించకపోవడం విశేషం. చివరికి టిడిపి నాయకులు కూడా నిరసించకపోవడం గమనార్హం. ఈ క్రమంలో జీవి రెడ్డి రాజీనామా చేసిన తర్వాత తొలిసారిగా చేసిన ట్వీట్ రాజకీయ వర్గాలలో సంచలనగా మారింది.. 33,000 కోట్ల రెవెన్యూ లోటుతో 3.2 లక్షల కోట్ల బడ్జెట్ రూపొందించారని జీవీ రెడ్డి ట్వీట్ చేశారు. ” రాజకీయాలకు దూరంగా ఉన్నాను.. చంద్రబాబు నాయకత్వం పట్ల నాకు గౌరవం ఉంటుంది. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. తక్కువ కాలంలోనే నాకు పార్టీలో గౌరవం దక్కింది. మనకు ఎప్పటికి రుణపడి ఉంటాను. 2029 లోనూ మా సార్ ముఖ్యమంత్రి కావాలని” జీవి రెడ్డి తను చేసిన ట్వీట్ లో వ్యాఖ్యానించారు.
Also Read : అల్లు అరవింద్ కి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి ఏం మాట్లాడాడు..?
టిడిపికి కాస్త రిలీఫ్
జీవి రెడ్డి చేసిన ట్వీట్ టిడిపికి కాస్త రిలీఫ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే జీవి రెడ్డి రాజీనామా తర్వాత టిడిపి క్యాంప్ ఒక్కసారిగా ఆత్మ రక్షణలో పడిపోయింది. ప్రతిపక్ష వైసిపి చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పలేక నిశ్శబ్దాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే రాజీనామా చేసిన కొద్ది రోజులలోనే జీవి రెడ్డి టిడిపికి అనుకూలంగా ట్విట్ చేయడం.. చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థించడం విశేషం. దీంతో టిడిపి క్యాంప్ కు కాస్త రిలీఫ్ లభించినట్టయింది.
నిన్న ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కేవలం రూ. 33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే రూ. 3 లక్షల 22 వేల కోట్ల బారి బడ్జెట్ను ప్రణాళికబద్ధంగా రూపొందించారు.
నేను నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల…
— G V Reddy (@gvreddy0406) March 1, 2025