CM Chandrababu : రాయలసీమలో ‘బూడిద’ పంచాయితీ వివాదానికి కారణమవుతోంది.ముఖ్యంగా కూటమిలో విభేదాలకు అవకాశం కల్పిస్తోంది.ఈ తరుణంలో సీఎం చంద్రబాబు కలుగజేసుకున్నారు. దిద్దుబాటు చర్యలకు దిగనున్నారు. సిమెంట్ పరిశ్రమలకు బూడిద తరలించే విషయంలో జెసి దివాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి వర్గీయుల మధ్య వివాదం తలెత్తింది. ఇప్పటివరకు జెసి వర్గీయులే బూడిద తరలిస్తుండగా.. రవాణాలో తమకు వాటా కావాలని ఆదినారాయణ రెడ్డి వర్గీయులు పట్టుపట్టారు. అప్పటినుంచి వివాదం నడుస్తోంది. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కలుగ చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఇది కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరుగా నిలుస్తోంది. జెసి ప్రభాకర్ రెడ్డి టిడిపిలో సీనియర్ నేత. ఆదినారాయణ రెడ్డి సైతం బిజెపి ఎమ్మెల్యే. తాజా వివాదం కూటమి ప్రభుత్వం పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే టిడిపి ఇన్చార్జ్ భూపేష్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, జెసి ప్రభాకర్ రెడ్డిలకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. సీఎం చంద్రబాబును కలుసుకోవాలని వర్తమానం అందింది. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయంలో దీనిపై పంచాయితీ జరగనుంది. దీనికి చంద్రబాబు ఒక పరిష్కార మార్గం చూపి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం కనిపిస్తోంది.
* అడ్డుకున్న ఆదినారాయణ రెడ్డి వర్గీయులు
ఆర్టిపిపి నుంచి సిమెంట్ పరిశ్రమలకు బూడిద తరలిస్తూ ఉండేవారు. ఈ క్రమంలో చాలా ఏళ్లుగా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ఇలా బూడిద తరలిస్తూ వచ్చారు. అయితే తమకు కూడా వాటాలు కావాలని ఆదినారాయణ రెడ్డి వర్గీయులు కోరారు. ఈ నేపథ్యంలో బూడిదను వాహనాల్లో నింపకుండా ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. అదే సమయంలో ఆదినారాయణ రెడ్డి వర్గీయుల బూడిద లారీలు తాడిపత్రి రాకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డగించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.కూటమి పార్టీల మధ్య విభేదాల పర్వం అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం నడిచింది. దీనిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దిద్దుబాటు చర్యలకు దిగారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడబోమంటూ నేతలకు హెచ్చరించారు. అందుకే ముగ్గురు నేతలకు ముఖ్యమంత్రి కార్యాలయానికి రావాలని సూచించారు.
* పోలీసుల అప్రమత్తం
మరోవైపు ఈ వివాదం నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అయింది. తాడిపత్రి జాతీయ రహదారిలోని కొండాపురం మండలం సుగుమంచిపల్లె చెక్ పోస్ట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఈ వివాదాన్ని ఆదిలోనే తుంచేయ్యాలని చంద్రబాబు భావిస్తున్నారు. వీలైనంత త్వరగా పరిష్కార మార్గం చూపి ఎండ్ కార్డు వేయాలని చూస్తున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Jc prabhakar reddy and adinarayana reddy quarrels for pond ash at rtpp kadapa and cm chandrababu to resolve issue
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com