Janasena Leader Cheated Woman: జనసేన నేతలపై ఏదో ఒక వివాదం వెలుగు చూస్తూనే ఉంది. తాజాగా ఒక నేతపై లైంగిక ఆరోపణల ఫిర్యాదు వచ్చింది పోలీసులకు. ప్రేమ పేరుతో వంచించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని కోరితే దారుణంగా కొట్టి హింసించాడు అంటూ నర్సీపట్నం జనసేన నేతపై ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ఇదో సంచలన అంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నర్సీపట్నం జనసేన ఇన్చార్జ్ రాజాన సూర్యచంద్ర పై ఓ మహిళ తమ తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. 12 సంవత్సరాలుగా తనతో సహజీవనం చేస్తూ ఇప్పుడు పెళ్లి చేసుకోనంటూ వేధిస్తున్నాడని సూర్యచంద్ర పై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం.
* పోలీసులకు ఫిర్యాదు
నర్సీపట్నం( Narsipatnam ) నియోజకవర్గంలోని నాతవరం గ్రామానికి చెందిన లావణ్య 12 ఏళ్ల కిందట విడాకులు తీసుకుంది. సూర్యచంద్ర ఒత్తిడితోనే తాను భర్తకు విడాకులు ఇచ్చినట్లు చెబుతోంది. అయితే గత 12 సంవత్సరాలుగా వివాహం చేసుకోవాలని కోరుతోంది. అదిగో ఇదిగో అంటూ సూర్యచంద్ర కాలయాపన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో సూర్యచంద్ర లావణ్య ఇంటి వద్దకు వచ్చి గలాటా చేసినట్లు బాధితురాలు చెబుతోంది. మద్యం మత్తులో వచ్చి తాను గతంలో ఇచ్చిన సెల్ ఫోన్ అడిగాడని.. ఉదయం ఇస్తానని చెప్పిన తనతో పాటు తన తండ్రిపై దాడి చేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై లావణ్య నాతవరం పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలన వార్తగా మారింది. అయితే ఆమె పోలీసుల కు ఫిర్యాదు చేశారు కానీ.. లిఖితపూర్వకంగా కాకుండా.. మౌఖికంగా చేసినట్లు నాతవరం ఎస్సై తారకేశ్వరరావు చెబుతున్నారు.
* కొద్దిరోజులుగా ఇన్చార్జిగా..
నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఉన్నారు చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఆ నియోజకవర్గ నుంచి గెలిచిన అయ్యన్నపాత్రుడు ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్గా కొనసాగుతున్నారు. అదే నియోజకవర్గానికి గత కొంతకాలంగా జనసేన ఇన్చార్జిగా కొనసాగుతున్నారు సూర్యచంద్ర( Surya Chandra). అయితే తనతో సహజీవనం చేస్తూ.. పెళ్లి చేసుకోమంటే వేధిస్తున్నాడు అంటూ సూర్యచంద్ర పై పోలీసులను ఆశ్రయించింది బాధిత మహిళ. అయితే ఆమె కేవలం కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరిందని.. లిఖితపూర్వక ఫిర్యాదుకు వెనుకడుగు వేయడం మాత్రం అనుమానాలకు తావిస్తోంది. బాధితురాలి అభీష్టం మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతుండడం మాత్రం గమనార్హం.
పెళ్ళి చేసుకుంటానని నమ్మించి వివాహితను శారీరకంగా వాడుకొని మోసం చేసిన జనసేన నాయకుడు
నర్సీపట్నం జనసేన ఇంచార్జి సూర్యచంద్ర తనను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా వాడుకొని మోసం చేసాడని నాతవరం పీఎస్లో ఫిర్యాదు చేసిన మహిళ
తన భర్తను చంపుతానని జనసేన ఇంచార్జి సూర్యచంద్ర బెదిరించి… pic.twitter.com/xY0LOtfo7W
— Telugu Scribe (@TeluguScribe) January 19, 2026
