Homeఆంధ్రప్రదేశ్‌Janasena Joinings Committee: జనసేనలో చేరికలు.. అంతా కమిటీదే బాధ్యత!

Janasena Joinings Committee: జనసేనలో చేరికలు.. అంతా కమిటీదే బాధ్యత!

Janasena Joinings Committee: జనసేనలో చేరికలకు అధినేత పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే కేవలం రాజకీయ పార్టీల నేతలు మాత్రమే కాదు. సమాజం పై ప్రభావం చూపే వివిధ రంగాల ప్రముఖులతో పాటు తటస్థులను పెద్ద ఎత్తున పార్టీలో చేర్పించేందుకు పవన్ కళ్యాణ్ సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. 14 మంది అత్యంత సీనియర్ నేతలతో కూడిన ఆంధ్రప్రదేశ్ జాయినింగ్స్ కమిటీని అధికారికంగా నియమించారు. తద్వారా వివిధ పార్టీల్లో ఉన్న మంచి నేతలను, సమాజం పై ప్రభావం చూపే నిష్ణాతులను, వివిధ రంగాల ప్రముఖులను జనసేనలో చేర్పించే కసరత్తు మొదలుపెట్టారు. అయితే నియమించిన ఈ కమిటీలో ఇటీవల పార్టీలో చేరిన నేతలతో పాటు పాతవారికి సైతం అవకాశం కల్పించారు.

* సీనియర్ నేతలకు బాధ్యతలు..
జనసేనలో ఈ హై ప్రొఫైల్ కమిటీలో అన్ని ప్రాంతాల నాయకులకు అవకాశం ఇచ్చారు. కమిటీ సభ్యులుగా ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్, పంతం నానాజీ, ఎంపీ లింగం నేని రమేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సామినేని ఉదయభాను నియమితులయ్యారు. పార్టీ సీనియర్లుగా ఉన్న కొటికలపూడి చినబాబు, డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్, కురికన రవికుమార్, ఒంపూరు గంగులయ్య, టిసి వరుణ్, ఆరణి మదన్ లకు ఈ కమిటీలు చోటు కల్పించారు.

* త్వరలో కీలక సమావేశం..
మొన్నటి ఎన్నికల ముందు, ఫలితాలు వచ్చిన తర్వాత జనసేనలో వివిధ పార్టీల నుంచి నేతలు భారీగా చేరారు. మరి కొంతమంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరితో పాటు సమాజంలోని విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్తులను పార్టీలోకి ఆహ్వానించి.. వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వడమే ఈ కమిటీ ప్రధాన బాధ్యత. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు పవన్ కళ్యాణ్. అక్కడ నుంచి వచ్చిన తర్వాత అమరావతిలోని కేంద్ర కార్యాలయంలో కమిటీ సభ్యులకు సమావేశం కానున్నారు. పార్టీలో చేరికల విషయంలో దిశా నిర్దేశం చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...

YS Jagan Mohan Reddy: జగన్ జైలు పరామర్శలు.. వైసీపీలో కొత్త చర్చ!

YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి మొండివాడు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు స్వయంగా చెబుతారు. అయితే ఆయన మొండితనం ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు. కానీ అదే...

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...
Oktelugu Epaper
Exit mobile version