Homeఆంధ్రప్రదేశ్‌Jana Sena MLA Arava Sridhar: మంచి రోమాంటిక్.. జనసేన ఎమ్మెల్యే మరో వీడియో వైరల్

Jana Sena MLA Arava Sridhar: మంచి రోమాంటిక్.. జనసేన ఎమ్మెల్యే మరో వీడియో వైరల్

Jana Sena MLA Arava Sridhar: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్( arava Sridhar ) వ్యవహారం సీరియల్ లా కొనసాగుతూనే ఉంది. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పట్లో దీనికి బ్రేక్ పడేలా లేదు. శ్రీధర్ పై బాధితురాలు ఒకవైపు ఆరోపణలు చేస్తూ.. మరోవైపు వారిద్దరి మధ్య జరిగిన వ్యవహారాలకు సంబంధించిన వీడియోలను బయటపెడుతోంది. తాజాగా బాధితురాలు మరో వీడియో సోషల్ మీడియాలో పెట్టడం వైరల్ అవుతోంది. తాను ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను విడిచి పెట్టే ఛాన్స్ లేదని తేల్చి చెబుతోంది బాధితురాలు. అందుకు తగ్గట్టుగానే ప్రతి రెండు రోజులకు ఒకసారి వీడియో విడుదల చేస్తూనే ఉంది.. తాజాగా శ్రీధర్ తో కలిసి కారులో ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి బయట పెట్టింది. దీంతో తమ ఇద్దరి మధ్య బంధం బయటపెట్టారు బాధితురాలు. ఇద్దరూ అలా సరదాగా కారులో వెళుతున్న దృశ్యాలను షేర్ చేసింది. ఇప్పటివరకు శ్రీధర్ తో చేసిన చాటింగులను మాత్రమే విడుదల చేసింది. తొలిసారిగా ఇద్దరూ కలిసి ఉన్న వీడియోను బయట పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.

* విచారణకు త్రిసభ్య కమిటీ..
ఇప్పటికే జనసేన( janasena ) హై కమాండ్ దీనిపై స్పందించింది. విచారణ కమిటీని నియమించింది. దానికి ఆధారాలు అందించారు.. వివరణ ఇచ్చారు శ్రీధర్. మరోవైపు మహిళా హక్కుల కమిషన్ ఆదేశాలతో కేసు నమోదు అయింది. అయితే జనసేనకు సంబంధించి త్రిసభ్య కమిటీ పూర్తిస్థాయి నివేదికను రెడీ చేసింది. ఈ వారంలోనే పార్టీ హై కమాండ్కు ఇవ్వనుంది. ఆయనపై ఎలాంటి చర్యలు ఉంటాయో నన్న చర్చ నడుస్తోంది. మరోవైపు బాధితురాలు క్యారెక్టర్ పై అనేక రకాల ఆరోపణలు వస్తున్న క్రమంలో.. ఆమె నేరుగా అరవ శ్రీధర్ తో సన్నిహితంగా ఉన్న వీడియోలను బయట పెడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే వీడియోలు రికార్డ్ చేశానని.. ఆయన తనను దూరం పెట్టిన తరువాత మాత్రమే వాటిని బయటపెట్టినట్లు చెబుతున్నారు బాధితురాలు. మొత్తానికైతే అరవ శ్రీధర్ ఎపిసోడ్లో రోజుకో మలుపు, వీడియోలు బయటకు వస్తుండడం విశేషం.

* పక్కా వ్యూహంతోనే..
అయితే పక్క రాజకీయ వ్యూహంతోనే ఈ వీడియోలు బయటకు వస్తున్నట్లు జనసేన వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈ అంశంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. నేతల వ్యక్తిగత వ్యవహారాలతో పార్టీకి ఇబ్బందులు తేవద్దని సూచించారు. వ్యక్తిగత అంశాలు ఉంటే వ్యక్తిగతంగానే తేల్చుకోవాలని.. పార్టీ వరకు తీసుకురాకూడదని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో త్రిసభ్య కమిటీ ఇచ్చే నివేదిక, బాధితురాలు విడుదల చేస్తున్న వీడియోలు.. వంటి వాటితో పవన్ కళ్యాణ్ అరవ శ్రీధర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version