Janasena Party : దత్తపుత్రుడు అంటే చెప్పుతో కొడతాం.. జగన్ పై జనసైనికుల ఫైర్!

పవన్ పై విమర్శల విషయంలో జనసైనికుల తీరు మారింది. గతం మాదిరిగా ఉదాసీనంగా వ్యవహరించే అవకాశం లేదు. జగన్ పై సైతం విమర్శలు చేసేందుకు వెనకాడడం లేదు.

Written By: Dharma, Updated On : October 25, 2024 2:10 pm

Janasena Party

Follow us on

Janasena Party :  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ విషయంలో వైసీపీ నేతలు ప్రయోగించే మాటలు అభ్యంతర కరంగా ఉంటాయి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకుంటూ ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. నిత్యం పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితంపై, ఆయన ప్యాకేజీ స్టార్ అంటూ చేసిన ఆరోపణలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. దీనిపై పవన్ కళ్యాణ్ సైతం స్ట్రాంగ్ గా రియాక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే.. మీ వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడాల్సి ఉంటుందని స్వయంగా పవన్ హెచ్చరించారు కూడా. తరచూ నాలుగో పెళ్ళాం నాలుగో పెళ్ళాం అంటున్నారని.. జగనే నాలుగో పెళ్ళం అంటూ పవన్ చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. తన విషయంలో మరోసారి వ్యక్తిగత కామెంట్లకు దిగవద్దని జగన్ ను హెచ్చరించారు పవన్. అయితే ఎన్నికల అనంతరం పవన్ విషయంలో జగన్ ఎటువంటి వ్యక్తిగత కామెంట్లు చేయలేదు. దీంతో జగన్ ఇకనుంచి వాటి జోలికి పోరని అంతా భావించారు. కానీ అనూహ్యంగా నిన్న విజయనగరం పర్యటనలో జగన్ అదే తరహా ఆరోపణలు చేశారు. పవన్ దత్తపుత్రుడు అంటూ వ్యాఖ్యానించారు.అయితే గతంలో విపక్షంలో ఉండేది జనసేన. ఇప్పుడు అధికారపక్షం కావడంతో ఆ పార్టీ శ్రేణులు.. జగన్ తీరుపై మండిపడుతున్నారు.

* బొలిశెట్టి హాట్ కామెంట్స్
తాజాగా జగన్ కామెంట్స్ పై స్పందించారు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ. జగన్మోహన్ రెడ్డి గారు ఉండాల్సిన చోట్లు రెండే. ఒకటి జైలు. రెండు పిచ్చాసుపత్రిలో అంటూ హాట్ కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా మళ్లీ ఇంకోసారి పవన్ కళ్యాణ్ ను దత్తపుత్రుడు అంటే నిన్ను చెప్పులతో కొట్టాల్సి వస్తుందంటూ జగన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వైరల్ అంశం గా మారింది. ఆ వీడియోను ట్రోల్ చేస్తున్నారు జనసైనికులు.

* జనసైనికులకు నోటి నిండా పని
మరోవైపు జగన్ పవన్ పై విమర్శలకు దిగుతుండడంతో జనసైనికులు నోటికి పని చెబుతున్నారు. సోషల్ మీడియాలో జగన్ తీరును ఎండగడుతున్నారు. అయితే గతంలో వైసిపి అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఇదే తరహా కామెంట్లు చేసేవారు. అప్పట్లో అధికారపక్షం కావడంతో జగన్ పై నేరుగా విమర్శలు చేసేందుకు జనసైనికులు వెనుకడుగు వేసేవారు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి పవన్ డిప్యూటీ సీఎం. ఆయనపై చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు జనసేన నేతలు. ఈ క్రమంలో రాజకీయ వేడి పెరుగుతోంది.