https://oktelugu.com/

Jagan: సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ అన్నావు కదా చంద్రబాబు.. జగన్ సెటైరికల్ ట్వీట్!

చంద్రబాబుపై జగన్మోహన్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా గట్టిగానే విమర్శలు చేశారు.

Written By: , Updated On : February 19, 2025 / 05:13 PM IST
Jagan

Jagan

Follow us on

Jagan: గుంటూరు మార్కెట్ యార్డులో ( Guntur market yard )మిర్చి రైతులను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం మిర్చి రైతుల సమస్యలపై సుదీర్ఘ ట్వీట్ చేశారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు బాధపడితే రాష్ట్రానికి అరిష్టమని.. వెంటనే గుంటూరు మార్కెట్ యార్డు రైతులను చంద్రబాబు కలవాలని డిమాండ్ చేశారు. మిర్చిని ప్రభుత్వమే కొనుగోలు చేసి వారికి బాసటగా నిలవాలని కోరారు జగన్మోహన్ రెడ్డి. బుధవారం గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి రైతులను జగన్ పరామర్శించారు. అనంతరం తన పర్యటనపై ఎక్స్ వేదికగా జగన్ సుదీర్ఘ ట్విట్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అంశంగా మారింది. ధరలు లేక.. పంటను కొనేవారు లేక మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జగన్.

* అన్నదాతలకు కష్టాలు, నష్టాలు
ఏపీలో టీడీపీ కూటమి( TDP Alliance) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు కష్టాలు,నష్టాలు మిగిలాయని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. పంటలకు మద్దతు ధర దేవుడెరుగు.. కనీసం అమ్ముకుందామన్న కొనేవారు లేరని ఆరోపించారు. మొన్నటి వరకు ధాన్యం రైతుల కష్టాలు, ఈరోజు మిర్చి రైతుల కష్టాలు చూస్తున్నానని చెప్పారు. చంద్రబాబు సీట్లోకి వచ్చి రైతులను మళ్లీ పట్టిపీడిస్తున్నారని విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నీరుడు క్వింటాలుకు అత్యధికంగా 21 నుంచి 27 వేల రూపాయల వరకు పలికిన మిర్చి ధర.. ఇప్పుడు 11 వేలకు పడిపోవడం దారుణం అన్నారు.

* దిగుబడులు తగ్గుముఖం
రాష్ట్రవ్యాప్తంగా తెగుళ్ల కారణంగా దిగుబడులు తగ్గుముఖం పట్టాయని కూడా గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy). ఏ జిల్లాలో చూసిన ఎకరాకు 10 క్వింటాలకు మించి రాలేదని వెల్లడించారు. పెట్టుబడి ఖర్చులు ఎకరాకు లక్షన్నర పైమాటే అవుతోందని.. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆరోపించారు. కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం,కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రైతుల పరిస్థితి దారుణంగా తయారయిందని ఆందోళన వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇంత జరుగుతున్న వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకోలేదని విమర్శించారు. ఒక్క సమీక్ష కూడా జరపలేదని.. ప్రభుత్వం తరఫున పలకరించే వారు కూడా లేరు అంటూ ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి అతి సమీపంలోనే గుంటూరు మార్కెట్ యార్డ్ ఉందని.. అయినా రైతుల బాధలు చంద్రబాబుకు వినిపించకపోవడం దారుణం అన్నారు.

* రైతు భరోసా ఏది
ఎన్నికల్లో చంద్రబాబు( Chandrababu) సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అన్నారని.. రైతులకు కేంద్రం ఇచ్చే పిఎం కిసాన్ కాకుండా.. 20వేల రూపాయలు ఇస్తామని నమ్మ బలికారని విమర్శించారు జగన్. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను మోసం చేశారని మండిపడ్డారు. పలావూ లేదు.. బిర్యానీ లేదు.. కానీ వైసీపీ హయాంలో ఇచ్చిన రైతు భరోసా కొనసాగించకుండా రద్దు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్ళు తెరిచి.. రైతే రాజన్న విషయాన్ని గుర్తించాలని డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి.