Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan : అంబానీ ఇంట వివాహానికి జగన్ మాస్ ఎంట్రీ.. వైరల్ వీడియో

YS Jagan : అంబానీ ఇంట వివాహానికి జగన్ మాస్ ఎంట్రీ.. వైరల్ వీడియో

YS Jagan : ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ రాయల్ వెడ్డింగ్ పై విదేశీ మీడియా సైతం చాలా ఫోకస్ పెట్టింది. ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక పెళ్లి గురించి ఇంతలా మాట్లాడుకుని ఉండరు. కథల్లోనూ, చరిత్రలోనూ ఆకాశమంత పందిరి, భూదేవి అంత అరుగులు వేసి వివాహం జరిగిందే అనేది విన్నాం. కానీ ఇప్పుడు అంబానీ కుటుంబంలో వివాహాన్ని చూస్తుంటే అది గుర్తుకొస్తోంది. దాదాపు ఏడు నెలల కిందట ప్రారంభమైన పెళ్లి తంతులువేడుకగా కొనసాగాయి. ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఈ పెళ్లి సందడి మీడియాలో ప్రత్యేక హంగామా సృష్టించింది. దేశ విదేశాల నుంచి వచ్చిన అతిథులు, సెలబ్రిటీలు, కుటుంబ సభ్యుల మధ్య వివాహ మహోత్సవం ముగిసింది.

అనంత్ అంబానీ వివాహ వేడుకలు ప్రపంచంలోనే ప్రత్యేకత చాటుకున్నాయి. ప్రపంచవ్యాప్త దిగ్గజాలు, ప్రముఖులు వివాహ వేడుకలకు హాజరయ్యారు.ఈ వేడుకలకు జగన్ మాస్ ఎంట్రీ ఇచ్చారు. జగన్ తో పాటు భార్య భారతి కూడా హాజరయ్యారు. అయితే జగన్ కు ఆహ్వానం లేదని ప్రచారం జరిగింది. కానీ వాటన్నింటినీ తెరదించుతూ జగన్ దంపతులు వివాహ వేడుకలకు హాజరయ్యారు. సంప్రదాయం ప్రకారం వారికి ఆహ్వానించారు అంబానీ కుటుంబ సభ్యులు. జగన్ దంపతులు ఎంతో ఉత్సాహంగా పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు.

2014లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. 151 స్థానాలతో దాదాపు వైట్ వాష్ చేసినంత పని చేసింది. తరువాత వచ్చిన అన్ని రకాల ఎన్నికల్లోను సత్తా చాటింది. రాజ్యసభలో సైతం ప్రాతినిధ్యం పెంచుకుంది. నాలుగేళ్ల కిందట ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ జగన్ ఇంటికి వెళ్లారు. ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కలిసి విందు కూడా చేశారు. ముఖేష్ అంబానీ సన్నిహితులు పరిమళ్ నత్వానికి రాజ్యసభ టికెట్ కోరడమే వీరి భేటీకి కారణం. జగన్ అభ్యర్థన మేరకు పరిమళ్ నత్వానికి రాజ్యసభ పదవి ఇచ్చారు జగన్. అటు తరువాత అంబానీతో సంబంధాలు కొనసాగుతాయని అంతా భావించారు. కానీ అదానీకి ఇచ్చిన ప్రాధాన్యం జగన్ అంబానీ కి ఇవ్వలేదన్న టాక్ నడిచింది. ఏపీలో పెట్టుబడుల విషయంలో కూడా అంబానీ పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో జగన్ తో విభేదాలు తలెత్తేయని అంతా భావించారు.

రాజకీయాల్లోకి రాకముందే జగన్ పారిశ్రామికవేత్తగా కొనసాగారు. 2004లో తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రావడంతో తన వ్యాపారాన్ని విస్తరించుకున్నారు. అప్పుడే దేశ పారిశ్రామిక దిగ్గజాలతో జగన్ కు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. జగన్ సీఎం కావడంతో పారిశ్రామిక వేత్తలు సైతం ఎంతగానో ఆనందపడ్డారు. తమ వర్గం నుంచి ఒక వ్యక్తి సీఎం కావడంతో వినూత్న పాలన అందిస్తారని భావించారు. కానీ జగన్ తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. 2019లో ఏకపక్ష విజయంతో దేశం మొత్తాన్ని తన వైపు చూసుకునేలా చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో దానికి మించి ఓటమితో మరోసారి చర్చనీయాంశం అయ్యారు. ప్రజలు ఘోరంగా తిరస్కరించారు.

అయితే ఇప్పుడు జగన్ దంపతులు అంబానీ కుటుంబంలో వివాహ వేడుకలకు హాజరు కావడం విశేషం. అంబానీ తో గత నాలుగేళ్లుగా పెద్దగా సన్నిహిత సంబంధాలు కొనసాగించలేకపోయారు జగన్. ఇదే అంబానీ ఇంట్లో నిశ్చితార్థ వేడుకలకు హాజరు కాలేదు. అప్పుడు సీఎం హోదాలో ఉండేవారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఈ వివాహ వేడుకలకు హాజరు కావడం విశేషం. ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా.. మాస్ ఎంట్రీ ఇచ్చారు జగన్. ఈ వివాహ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సెలబ్రిటీల మధ్య మెరిసిపోయారు.

LIVE : అనంత్ అంబానీ రిసెప్షన్ లో  వై.ఎస్ జగన్ మాస్ ఎంట్రీ  || ys jgan || ananth ambhani reseption ..
Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version