Jagan Vs Sharmila: పైసల కోసం తల్లి, చెల్లిపై పోరాటం .. అడ్డంగా బుక్కైన జగన్.. సంచలన లేఖ విడుదల చేసిన టీడీపీ

ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. సహజంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత.. పరిపాలనకు సంబంధించిన నిర్ణయాలు.. ప్రవేశపెట్టే పథకాలతో కాస్త హడావిడి ఉంటుంది. కానీ ఏపీలో ఇందుకు భిన్నంగా సాగుతోంది. ఎన్నికలు ముగిసి నాలుగు నెలలు పూర్తి కాకముందే.. అక్కడి వాతావరణం ఎన్నికల ముందునాటి పరిస్థితులను ప్రతిబింబిస్తోంది.

Written By: Dharma, Updated On : October 24, 2024 8:32 am

Jagan Vs Sharmila(2)

Follow us on

Jagan Vs Sharmila: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు కంటే.. ప్రతిపక్ష (హోదా కూడా దక్కించుకోలేకపోయింది) వైసిపి గురించిన విషయాలే మీడియాలో ప్రధాన వార్తలుగా ఉంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు రోజుకొకటి మీడియాలో సంచనంగా మారుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి – షర్మిల మధ్య నెలకొన్న ఆస్తుల వివాదాలు సరికొత్త మలుపు తీసుకుంటున్నాయి. ఇటీవల జగన్మోహన్ రెడ్డి షర్మిల తో రాజీకి వచ్చారని.. ఆస్తులకు సంబంధించి ఒప్పందాలు కూడా పూర్తి చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అవన్నీ పూర్తి అబద్దాలని.. ఊహ జనితాలని తేలిపోయింది. అయితే షర్మిలకు, జగన్మోహన్ రెడ్డికి మధ్య ఆస్తుల వివాదం సమసి పోలేదని.. ఆయన ఏకంగా తన సోదరి షర్మిల, మాతృమూర్తి విజయమ్మపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో కేసు దాఖలు చేశారని తెలుస్తోంది. అయితే ఈ పిటిషన్ ను ఆయన గత నెలలోనే వేశారని.. వచ్చే నెలలో అది విచారణకు వస్తుందని తెలుస్తోంది.

తెలివిగా బయట పెట్టిన టిడిపి

అన్న ప్రవర్తన తీరుతో విసిగి వేసారి పోయిన షర్మిల ఒక లేఖ రాసింది. అందులో తల్లి విజయమ్మ ప్రస్తావన కూడా ఉంది. అయితే దీనిని అత్యంత తెలివిగా టిడిపి బయట పెట్టింది. “సొంత తల్లి, చెల్లిపై కేసులు పెట్టాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఎంఓయూ ప్రకారం సొంత చెల్లికి దక్కాల్సిన ఆస్తులను కూడా మీరు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. మన తండ్రి అడుగుజాడల్లో నడవాల్సిన మీరు ఇలా దారి తప్పడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని” షర్మిల జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొనగా.. ఈ లేఖను అత్యంత తెలివిగా టిడిపి సంపాదించింది. దానిని ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది..”సొంత చెల్లి మీద, తల్లి మీద కేసులు పెట్టాలని నిర్ణయించుకున్న నువ్వు.. చివరికి వారికి దక్కాల్సిన ఆస్తులను కూడా లాక్కోవడానికి సిద్ధమయ్యావా జగన్మోహన్ రెడ్డి” అంటూ ప్రశ్నించింది.

ఇప్పుడు జగన్ వంతు

గతంలో చంద్రబాబును వెన్నుపోటుదారుడని పదేపదే జగన్మోహన్ రెడ్డి విమర్శించేవారు. లక్ష్మీపార్వతిని బయటికి గెంటివేశారని ఆరోపించేవారు. అయితే ఇన్నాళ్లకు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో జరుగుతున్న వివాదాలు టిడిపికి అనుకోని వరంలాగా మారాయి. దీంతో టిడిపి నాయకులు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో జరుగుతున్న వివాదాలలో మరింత రచ్చ లేపుతున్నారు. అత్యంత గోప్యంగా ఉండాల్సిన ఆధారాలను సభ్య సమాజం దృష్టికి తీసుకొస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే వైసీపీలో టిడిపి వేగులు ఉన్నట్టు తెలుస్తోంది. అందువల్లే కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఇన్నాళ్లు మంచి చేశాం.. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాం అని చెప్పిన జగన్ అసలు రూపాన్ని ప్రజల ముందు ఉంచుతున్నాయి. అయితే టిడిపి ఇక్కడితోనే ఆగుతుందా?.. లేక జగన్ కుటుంబంలో జరుగుతున్న విషయాలను మరింతగా బయటకు తీసుకొస్తుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుందని ఏపీ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.