YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పుంజుకునేందుకు ఆ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. మరోవైపు పార్టీ నేతలకు కేసులు వెంటాడుతున్నాయి. త్వరలో మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డికి ఈడి నోటీసులు అందించబోతుందన్న ప్రచారం నడుస్తోంది. ఇటువంటి తరుణంలో ఆ పార్టీ అధినేత వ్యూహాలు అంత పట్టడం లేదు. సొంత పార్టీ శ్రేణులకు మింగుడు పడడం లేదు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీలో ప్రాధాన్యం దక్కలేదని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం జరుగుతున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు.
* కొట్టిపారేస్తున్న ఢిల్లీ వర్గాలు..
అయితే వై వి సుబ్బారెడ్డి బాధ్యతలు చూస్తున్నట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే ఢిల్లీ వర్గాలు దానిని కొట్టిపారేస్తున్నాయి. ఇదంతా ఒక రకమైన పొలిటికల్ గేమ్ లో భాగంగా జరుగుతున్న ప్రచారం అని విశ్లేషకులు భావిస్తున్నారు. దర్యాప్తు సంస్థల నుంచి రక్షణ పొందేందుకు ఇటువంటి పర్సనల్ ఇమేజ్ మేనేజ్మెంట్ గ్రామాలకు తెరతీస్తున్నారని ఎక్కువ మంది ఆరోపిస్తున్నారు. అవినీతి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి పేరు వస్తే కేంద్ర పెద్దలు ఎందుకు స్పందిస్తారని వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి . కేంద్ర పెద్దలు ఆయనకు ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారు. ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డికి కేంద్ర పెద్దలు సులువుగా అపాయింట్మెంట్ ఇచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది.
* కేంద్ర పెద్దల ఆశీస్సులు ఉన్నాయని..
అయితే ఈ విషయంలో ప్రధాని అపాయింట్మెంట్ ను పక్కన పెడితే.. కేవలం మోడీకి జగన్ అంటే అభిమానం అనే కలరింగ్ ఇచ్చేందుకు వైసిపి ఇటువంటి ప్రచారాలకు దిగుతోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే గతంలో కొన్ని రకాల వ్యవహారాల్లో జగన్ అంటే ప్రధాని నరేంద్ర మోడీకి ఇప్పటికీ అభిమానమేనని పెయిడ్ ఎనలిస్టులతో చెప్పించుకున్నారు కూడా. ఇప్పుడు కూడా ఢిల్లీ స్థాయిలో అపాయింట్మెంట్ ప్రయత్నం జరగడం లేదు. కానీ అలా జరుగుతున్నట్లు.. కేంద్ర పెద్దలు ఇస్తున్నట్లు ఒక రకమైన ప్రచారం దిగుతున్నారు. దీని వెనుక ఒక మైండ్ గేమ్ ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఇటువంటి విచారణ విభాగాలకు ఒక రకమైన సంకేతాన్ని పంపడమేనని అర్థమవుతోంది. అన్నింటికీ మించి జగన్మోహన్ రెడ్డికి కేంద్ర పెద్దల ఆశీస్సులు ఉన్నాయని పార్టీ శ్రేణులకు ధైర్యం నింపే ప్రయత్నం తెలుస్తోంది. రాబోయే చట్టపరమైన చర్యల తీవ్రతను కూడా తగ్గించుకోవాలని ఆలోచన కనిపిస్తోంది. తప్పుచేసి ఢిల్లీ పెద్దల పేర్లను వాడుకుంటూ కవర్ చేసుకునే ప్రయత్నాలు చేయడం వల్ల.. ఆ పార్టీతో పాటు అధినేత రాజకీయ క్యారెక్టర్, విశ్వసనీయత దారుణంగా దెబ్బతింటున్నాయి. మరి తేల్చుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే.







