Jagan: ఏపీలో విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. పాలకపక్షంగా కూటమి ఉంది. ప్రతిపక్షంగా వైసిపి ఉంది. కానీ దానిని అధికారికంగా గుర్తించాలని వైసీపీ వాదన. ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నది డిమాండ్. అందుకే సభకు హాజరు కావడం లేదని సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. సభకు హాజరు కాకుండా.. వారం వారం ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అయితే ఇప్పుడు అంబటి రాంబాబు అరెస్ట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు. దానిని ఒక రాజకీయ కోణంలోనే చూశారు. ఒక వైసీపీ నేతగా అంబటి రాంబాబు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక స్టాండ్ తీసుకోవచ్చు కానీ.. ప్రజా సమస్య అన్నట్టు క్రియేట్ చేయడం మాత్రం ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేని వారికి మాత్రం నచ్చడం లేదు. అంటే తటస్తులు అన్నమాట.
* తప్పుతున్న మాటలు..
జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) ప్రజల ముందుకు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అంబటి రాంబాబును పొగడాల్సింది పోయి కొడతారా అని జగన్ అనే సరికి అక్కడ ఉన్నవారు సైతం ఆశ్చర్యపోయారు. అంబటి సీఎం చంద్రబాబును తిట్టారట.. ఆ తప్పు తెలుసుకుని మళ్లీ క్షమాపణ కోరారట.. అందుకే పొగడ మంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయన స్థాయికి ఆ మాటలు సరిపోతాయా? అంబటి బూతులతో రెచ్చిపోవడం అందరికీ కనిపిస్తోంది. వినిపిస్తోంది కూడా. ఒక మాజీ మంత్రిగా.. ఒక రాజకీయ పార్టీ నేతగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉండకూడదు. రాజకీయంగా విభేదించే నాయకులకు తిట్టమని చెప్పినట్టు ఉంది అంబటి రాంబాబు పరిస్థితి. ఇక జగన్మోహన్ రెడ్డి అయితే తిట్టిన వారు క్షమాపణ చెబితే చాలు అన్నట్టు ఉంది. ఇది ఎంత మాత్రం సహేతుకం కాదు.
* తనకు తానుగా క్లీన్ చీట్
సిబిఐ( Central Bureau of Investigation) నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం నెయ్యి కల్తీ వ్యవహారంపై విచారణ చేపట్టింది. కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పుకొచ్చింది. అయితే అది జంతు కొవ్వు కాదని.. రసాయనాల మిశ్రమంతో కూడినదని.. అసలు పాలతో తయారు చేసిన నెయ్యి కాదని తేల్చి చెప్పింది. అది వదిలేసి సిబిఐ సిట్ లడ్డు కల్తీ జరగలేదని క్లీన్ చీట్ ఇచ్చిందని జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా ప్రకటించుకోవడం కూడా అభ్యంతరకరంగా ఉంది. ఇందుకోసం ఏకంగా ఆయన ప్రతిష్టాత్మక ల్యాబ్ పేర్లు వాడుకున్నారు. తమ పార్టీ నేతలు అమాయకులని.. వారు ఏం తప్పు చేయలేదని తేల్చి చెప్పారు జగన్మోహన్ రెడ్డి. మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఎంత మాత్రం సహించడం లేదు సామాన్య జనాలకు. పైగా ఏదైనా పోరాటం చేయాలంటే ప్రభుత్వ వైఫల్యాలపై చేయాలి కానీ.. తమ హయాంలో తప్పులు జరగలేదని పోరాటం చేయాల్సి రావడం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలకు దురదృష్టకరం. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంలో ఉన్న ఆయన ప్రజా సమస్యల కంటే.. తమ హయాంలో తప్పులు జరగలేదని చెప్పడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఇలా అయితే ప్రతిపక్షంతో రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం శూన్యం.