Homeఆంధ్రప్రదేశ్‌AP CM Jagan - BalaKrishna : బాలయ్యలో ముసలితనాన్ని చూసిన జగన్

AP CM Jagan – BalaKrishna : బాలయ్యలో ముసలితనాన్ని చూసిన జగన్

AP CM Jagan – BalaKrishna : నందమూరి బాలక్రిష్ణకు ఏపీ సీఎం జగన్ హార్ట్ కోర్ ఫ్యాన్ అంటారు. రాజకీయాల్లోకి రాక ముందు బాలయ్య అభిమాన సంఘం ప్రతినిధిగా ఉన్నారన్న ఒక ప్రచారం ఉంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో బాలక్రిష్ణ ఎన్నో సినిమాలు తీసినందున అది వాస్తవమని నమ్మేవారు ఎక్కువ. అయితే బాలయ్యను అంతలా అభిమానించిన జగన్ సీఎం అయ్యారు. బాలయ్య మాత్రం ఎమ్మెల్యేగా ఉండిపోయారు. కానీ బాలయ్యపై జగన్ ఏనాడూ కామెంట్స్ చేసిన దాఖలాలు లేవు. కానీ తాజాగా పవన్ పై కామెంట్స్ చేసే క్రమంలో బాలయ్యపై కూడా జగన్ ఫైర్ అయ్యారు. ముసలాయన అంటూ సంభోదించారు.వెధవ పనులు చేస్తుంటారంటూ సెటైర్లు వేశారు.

తిరుపతి జిల్లా ధర్మవరంలో నేతన్న హస్తం పథకానికి సంబంధించి సీఎం జగన్ బటన్ నొక్కారు. అనంతరం మాట్లాడిన ఆయన వలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఒక్క పవన్ నే కాకుండా లోకేష్, బాలక్రిష్ణలపై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఇప్పుడివి తెగ వైరల్ అవుతున్నాయి.సంస్కారం ఉన్న ఏ ఒక్కరూ వలంటీర్లను అవమానించరని.. పట్టపగలే మందు తాగుతూ పది మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ పక్కనే డ్యాన్సులు చేసేవాడు ఒకడు, అమ్మాయి కనిపిస్తే ముద్దన్నా పెట్టాలి, కడుపన్నా చేయాలని ఇంకొక దౌర్భాగ్యుడంటాడు. నువ్వు సినిమాల్లోనే చేశావు, నేను నిజజీవితంలో చేశాను అంటూ వెధవ పనులను ఇంకొక ముసలాయన చెప్పుకుంటాడ‌ని.. అలాంటి సంస్కార హీనులు వ‌లంటీర్ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం సిగ్గుచేటు అంటూ పవన్, లోకేష్, చంద్రబాబులపై ఓ రేంజ్ లో జగన్ విరుచుకుపడ్డారు.

అయితే ఇప్పటివరకూ జగన్ విమర్శలను తీసుకుంటే నేరుగా చంద్రబాబుపై విమర్శలు చేయడమే చూసుంటాం. అటు పవన్ తో పాటు ఎల్లో మీడియాపై పరోక్ష వ్యాఖ్యలకే పరిమితమయ్యేవారు. లోకేష్, బాలక్రిష్ణలను పెద్దగా లెక్కలోకి తీసుకునేవారు కాదు. కానీ ఎందుకో సీఎం జగన్ సెడన్ గా రూటు మార్చారు. ఈ రోజు సైతం ఎక్కడా పవన్ పేరు ఎత్తలేదు. కానీ వలంటీరు వ్యవస్థను తప్పుపడుతున్న వారు చంద్రబాబుకు పదేళ్లుగా వాలంటీరుగా సేవలందిస్తున్నారని సెటైర్లు వేశారు. అయితే ఇలా సభలో ప్రసంగిస్తున్నంత సేపు జగన్ పేపరును చూడడం కనిపించింది. అంటే పక్కా ముందస్తు వ్యూహంతోనే కౌంటర్ అటాక్ కు దిగినట్టు అర్ధమవుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular