ఆంధ్రప్రదేశ్‌YS Jagan: కడప తేడా కొడుతోంది.. జగన్ కొత్త ఆలోచన!

YS Jagan: కడప తేడా కొడుతోంది.. జగన్ కొత్త ఆలోచన!

YS Jagan: కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి పోటీ చేయనున్నారా? ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి తో రాజీనామా చేయించుకున్నారా? ఉప ఎన్నికకు వెళ్లి తాను ఎంపీ కావాలని చూస్తున్నారా? ఢిల్లీలో మారుతున్న పరిణామాలతోనే ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. తనను బలి పశువు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన గుర్తించి.. జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరం అనుకుంటే తిరుగుబాటు చేసి బిజెపిలోకి వెళ్తారని కూడా పొలిటికల్ వర్గాల్లో ఒక టాక్ నడుస్తోంది.

* పాత కేసులు తెరపైకి..
ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పై ఉన్న పాత కేసులు తెరపైకి వస్తున్నాయి. అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై ఉన్నారు. 2012లో బెయిల్ లభించడంతో అప్పటినుంచి ఇప్పటివరకు కొనసాగుతూ వచ్చారు. 2019 ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు ప్రతి వారం సిబిఐ కోర్టుకు హాజరై సంతకం చేసేవారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పై ఉన్న అక్రమాస్తుల కేసులకు సంబంధించి విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే జగన్మోహన్ రెడ్డికి చిక్కులు తప్పవు. ఈ తరుణంలో ఎంపీగా దేశ రాజధాని లో ఉంటే కేసుల తీవ్రత తగ్గించుకోవచ్చని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

* వివేకా హత్య కేసు..
ఇంకోవైపు వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా వెంటాడుతోంది. మొన్నటి ఎన్నికల్లో విపరీతమైన ప్రభావం చూపింది. కడప జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలు కూటమి గెలుచుకుంది. మూడు అసెంబ్లీ సీట్లతో పాటు ఒక ఎంపీ సీట్లు మాత్రమే వైసిపి గెలుచుకోగలిగింది. కడప పార్లమెంటు స్థానంలో మెజారిటీ గణనీయంగా పడిపోయింది. అందుకే వచ్చే ఎన్నికల్లో మరోసారి అవినాష్ బరిలో దించితే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా అవినాష్ రెడ్డి తో రాజీనామా చేయించి.. ఆయన స్థానంలో ఎంపీ కావాలని జగన్ భావిస్తున్నారు. తన కేసుల తీవ్రతను తగ్గించుకోవాలని చూస్తున్నారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో అవినాష్ ను తప్పించి తన భార్య భారతి రెడ్డిని అక్కడ గెలిపించుకోవాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలన్నీ తెలిసి అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారని.. అవసరం అనుకుంటే తిరుగుబాటు చేసి బిజెపిలో చేరుతారని కూడా కడప పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...

Tammineni Family: పోలీసుల కళ్ళుగప్పి.. పరారీలో తమ్మినేని ఫ్యామిలీ!

Tammineni Family: ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ తమ్మినేని సీతారాం. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఆయన సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఒకసారి...

Most Popular

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....
Oktelugu Epaper
Exit mobile version