Jagan Tirumala Laddu Controversy: దేశంలో ఉగ్రవాదుల దాడులు జరిగినప్పుడు మతవాదం ఎక్కువగా వెలుగులోకి వస్తుంది. ఆ సమయంలో నేతల వైఖరి భిన్నంగా ఉంటుంది. ఆ సమయంలో అయితే చాలామంది నేతలు మువ్వన్నెల జెండాను చేత పట్టుకుని సంఘీభావం తెలుపుతారు. అయితే ఇప్పుడు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆ అవసరం ఏర్పడింది. తిరుమల లడ్డు వివాదం అనేది హిందూ సమాజంపై ప్రభావం ఉంటుంది. అటువంటి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనే ఆరోపణ తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇటువంటి సమయంలో హిందుత్వ వాదాన్ని ప్రదర్శించాలంటే ఆ పార్టీకి ఇబ్బందికరమే. ఎందుకంటే అధినేత జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ మతానికి చెందినవారు. అది ఎంత మాత్రం తప్పులేదు. తప్పు కాదు కూడా. ఎందుకంటే మతాన్ని స్వీకరించే హక్కు రాజ్యాంగం అందరినీ కల్పించింది. అయితే ఒక్క మతం హక్కును, సంప్రదాయాన్ని ఇబ్బంది తెచ్చి పెట్టేలా చేయడం చాలా నేరం.
Also Read: లోకేష్ తలచుకుంటే అంతే!
* అన్య మతానికి ప్రాధాన్యం..
వైసిపి హయాంలో తిరుమల కొండను అన్య మతాలకు రాసిచ్చారనే విమర్శ ఉంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా అనుమానాలకు బలం చేకూరేలా ఉన్నాయి. అప్పట్లో తిరుమలకు తీసుకెళ్లే బస్సులకు సంబంధించి ఆన్లైన్ టికెట్లపై యేసయ్య అని రాసి ఉండడం సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. టీటీడీ నియామకాల తో పాటు అన్ని అంశాల్లో అన్యమతస్తులకు అవకాశాలు కల్పించాలని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వపరంగా అన్ని మతాలకు అవకాశాలు కల్పించాలి. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక ధార్మిక సంస్థ. ఇక్కడ నియామకాలు విషయంలో మాత్రం శ్రీవారి భక్తి భావం ముఖ్యం. కానీ అవేవీ పరిగణలోకి తీసుకోకుండా నియామకాలు చేపట్టారు అన్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణ మాత్రమే కాదు. అంతకుమించి కూడా.
* చివరి వరకు వెంటాడనుంది..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నిరంతరాయంగా హిందుత్వవాదం అనేది వెంటాడే అంశమే. ఎందుకంటే అధినేత జగన్మోహన్ రెడ్డి స్వతహాగా క్రిస్టియన్. ఆయన కుటుంబం క్రిస్టియన్ మతం స్వీకరించి.. ఆ మత ఆచారాలను పాటిస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇటువంటి సమయంలో టీటీడీ అధ్యక్షులుగా నియమితులైన భూమన కరుణాకర్ రెడ్డి, వై వి సుబ్బారెడ్డి కూడా క్రిస్టియన్లే అనే ఆరోపణలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగా కొన్ని రకాల విషయాలు బయటపడ్డాయి. మరోవైపు వైసీపీ హయాంలో నెయ్యి కల్తీ ఆరోపణ రావడం అనేది కూడా హిందువుల పై ప్రభావం చూపింది. ఇలా ఎలా చూసుకున్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇదో మాయని మచ్చ. చెరుపుకోలేని మరక కూడా. ఒకవైపు చూస్తే మత విశ్వాసం. ఇంకో వైపు చూస్తే రాజకీయం. ప్రజాస్వామ్యంలో మతాలకు, కులాలకు తావులేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మత విశ్వాసాన్ని పాటించాలి. రాజకీయం చేయాలి. ఇప్పటివరకు హిందువులను ఆకట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ పరిణామాలు చూస్తుంటే ఇకనుంచి ఆ పని కష్టమే అని తేలిపోతోంది.