Homeఆంధ్రప్రదేశ్‌Jagan MaVigan: బెడ్ రూమ్ మచిలీపట్నంలో.. బాత్రూం విజయవాడలో.. హాల్ గుంటూరులో.. ఇదీ జగన్...

Jagan MaVigan: బెడ్ రూమ్ మచిలీపట్నంలో.. బాత్రూం విజయవాడలో.. హాల్ గుంటూరులో.. ఇదీ జగన్ మావిగన్

Jagan MaVigan: ఒకప్పుడు రాజకీయ నాయకులు ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు అంతగా నిరసన వ్యక్తం చేసేవారు కాదు. పైగా నాయకులు తీసుకున్న నిర్ణయాలకు ఏకపక్షంగా ఆమోదం తెలిపేవారు. ఎప్పుడో ఒకసారి.. కొండ తెగిపడినట్టు నిరసన తెలిపేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నాయకులు నిర్ణయాలు తీసుకుంటే నచ్చని ప్రజలు మొహమాటం లేకుండా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పైగా నేతలను తిడుతున్నారు. తమకున్న అవగాహనతో నేతలు తీసుకున్న తప్పుడు నిర్ణయాలను లెక్కలతో సహా వివరిస్తున్నారు.

ఏపీలో 2019 నుంచి 2024 వరకు వైసిపి అధినేత జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాడు అమరావతిని ఆయన వ్యతిరేకించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలని సూచించారు. అదేవిధంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. కానీ మూడు రాజధానులకు సంబంధించిన పనులు ఐదేళ్ల పరిపాలన కాలంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీనికి తోడు అధికారం ముగిసే చివరి రోజుల్లో ఏపీ రాజధాని వైజాగ్ అంటూ ప్రకటించారు. వైజాగ్ లోని రిషికొండ ప్రాంతంలో తాను ఒక అధికారిక నివాసం ఏర్పాటు చేసుకున్నట్లు జగన్ ప్రకటించారు.

జగన్ మాట్లాడిన ఈ మాటలను జనం నమ్మలేదు. అందువల్లే 2024 ఎన్నికల్లో ఆయన పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే ఇచ్చారు. ఒక రకంగా ప్రజలు నేరుగా జగన్ కు ఓటు ద్వారా తెలిపిన నిరసన ఇది. అప్పుడే అర్థమై ఉంటుంది జగన్ కు ఏపీ ప్రజలు ఎంత తెలివైన వారోనని. తాజాగా జగన్ మావిగన్ అనే ప్రకటన చేశారు. గుంటూరు.. విజయవాడ.. మచిలీపట్నం ప్రాంతాలను కలుపుతూ రాజధాని నిర్మాణం చేస్తే బాగుంటుందని ప్రకటించారు. దీనికి మావిగన్ అని పేరు కూడా పెట్టారు. దీనిపై అప్పట్లోనే సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివ్ ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో మావిగన్ ప్రకటనపై రకరకాల చానల్స్ ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం మొదలుపెట్టాయి. అందులో ఒక వ్యక్తి వివరించిన తీరు మామూలుగా లేదు.

“మీ అడ్రస్ ఎక్కడుంది అంటే పలానా ప్రాంతం చెప్తారు. మా ఇల్లు ఎక్కడ ఉందంటే పలానా చోట ఉందని అంటాం. అలా కాకుండా బెడ్ రూమ్ విజయవాడలో.. బాత్రూం గుంటూరులో.. హాల్ మచిలీపట్నంలో ఉందని చెప్పలేం కదా.. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎప్పటికీ అమరావతినే. దీనిని ఎవరు మార్చలేరు. మావిగన్ అనేది పిచ్చికి పరాకాష్ట అంటూ” ఆ వ్యక్తి వ్యాఖ్యానించాడు. అతను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version