Janasena: జనసేనతో( Jana Sena) పొత్తుకు జగన్ సిద్ధపడ్డారా? కానీ పవన్ ఒప్పుకోలేదా? పొలిటికల్ వర్గాల్లో ఈ ప్రచారం ఎక్కువగా ఉంది. 2029 ఎన్నికల్లో టిడిపిని సైడ్ చేసి.. జనసేన, వైసిపి, బిజెపి కలిసి పోటీ చేస్తాయని పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం అయితే ఉంది. గతంలో నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి సైతం ఈతరహ వ్యాఖ్యానాలు చేశారు. అయితే పవన్ మాత్రం మరో 15 ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో రాకుండా అడ్డుకుంటామని చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో పవన్ కళ్యాణ్ కు ఒక స్టాండ్ ఉంది. అది ఒక ఫిక్స్ గా కనిపిస్తోంది. కానీ జాతీయస్థాయిలో బిజెపి వైఖరి తో కొన్ని రకాల రాజకీయ అంచనాలు ఉంటున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఆ పార్టీ రాజకీయ వ్యూహంతోనే ఇటువంటివి పుట్టుకొస్తున్నాయి.
* భిన్నాభిప్రాయమే..
మెగా ఫ్యామిలీలో( mega family ) పవన్ కళ్యాణ్ ఆలోచన భిన్నంగా ఉంటుంది. అది చాలా సందర్భాల్లో చూసాం కూడా. చిరంజీవితో పాటు నాగబాబు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకులుగా ముద్ర ఉంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అదే టిడిపికి ఫేవర్ గా ఉంటారు. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీతో సినిమా పరంగా విభేదాలు కావచ్చు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయ కోణంలోనే చూస్తూ వచ్చారు. అందుకే చంద్రబాబుతో స్నేహం చేశారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. 2009లో ప్రజారాజ్యం మూలంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అనే ఒక అంచనా ఉంది. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం కూడా పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదు. ఎందుకో వైయస్ రాజశేఖర్ రెడ్డి విషయంలో సైతం సానుకూలత చూపలేదు పవన్ కళ్యాణ్. ప్రజారాజ్యం పార్టీ ఫెయిల్యూర్ నుంచి గుణపాఠాలు నేర్చుకుని జనసేన ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. ప్రజారాజ్యం పార్టీ ఉన్న సమయంలోనే పవన్ కళ్యాణ్ రాజశేఖర్ రెడ్డి తో పాటు అప్పటి కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి గట్టి వ్యాఖ్యలు చేశారు. తద్వారా వారిపై ఉన్న తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
* ఆది నుంచి అంతే..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress )పార్టీపై కూడా అదే తరహా అభిప్రాయంతో ఉండేవారు పవన్ కళ్యాణ్. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు సాఫ్ట్ కార్నర్ ఉంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలి. కానీ అనూహ్యంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి, కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించారు. అది మొదలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై విపరీతమైన ద్వేషంతోనే గడుపుతూ వచ్చారు. దానికి కారణం లేకపోలేదు. పవన్ కళ్యాణ్ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా చులకనగా చూసింది. అది ఒక పార్టీయేనా అని హేళన చేసింది. కనీసం చిన్న పార్టీగా కూడా లెక్క చేయలేదు. ఈ పరిస్థితులన్నీ గమనించారు పవన్ కళ్యాణ్. అవమానాలను తట్టుకొని నిలబడ్డారు. టిడిపి, బిజెపితో కూటమి కట్టి జగన్మోహన్ రెడ్డిని దారుణంగా ఓడించారు. అయితే ఇప్పుడు బీజేపీ మార్గదర్శకం చేసిందనో.. ఇతర కారణాలతో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపే అవకాశమే లేదు. ఇదంతా మీడియా సృష్టి అని స్పష్టమవుతోంది. అలాగని పవన్ కళ్యాణ్ తమతో చేతులు కలుపుతారని వైసీపీ నేతలకు కూడా నమ్మకం లేదు. కేవలం కూటమి పార్టీల మధ్య విచ్ఛిన్నం రావడానికే ఈ తరహా ప్రచారం.
@JanaSenaParty పార్టీతో పొత్తుకు జగన్ సుముఖం గానే ఉన్నారు కానీ ఎందుకో పవన్ కళ్యాణ్ గారికే మాపైన చాలా తీవ్రమైవ వ్యతిరేకత ఉంది ✅
ప్రజారాజ్యం టైంలో కూడా YSR గారిని పంచలూడదీసి తరిమి తరిమి కొడతా అని వార్నింగ్ ఇచ్చాడు – కేతిరెడ్డి @PawanKalyan @KethireddyMla @ysjagan pic.twitter.com/nPgh8HkMR9
— Viswanadh (@Viswa_Tweeetz) January 7, 2026