Homeఆంధ్రప్రదేశ్‌Jagan fans protest Nampally court: జగన్ అభిమానుల రఫ్పా.. రఫ్పా.. ఇలా అయితే కేసులు...

Jagan fans protest Nampally court: జగన్ అభిమానుల రఫ్పా.. రఫ్పా.. ఇలా అయితే కేసులు మాఫి అవుతాయా?

Jagan fans protest Nampally court: ఒక కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి.. న్యాయస్థానంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి.. విచారణ సమయంలో కోర్టుకు హాజరయ్యేటప్పుడు ఎటువంటి బల ప్రదర్శన చేయకూడదు. ముఖ్యంగా సమాజాన్ని పెడదోవ పట్టించే విధంగా వ్యవహరించకూడదు. కానీ గురువారం జగన్ అనుచరులు తెలంగాణ రాష్ట్రంలో చేసింది ఇదే.

Also Read:   తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెస్ రీ ఎంట్రీ?!

అక్రమాస్తుల కేసులో జగన్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు.. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఆయన కేసు విచారణకు హాజరయ్యారు. బెంగళూరు నుంచి ప్రత్యేకమైన విమానంలో ఆయన బేగంపేటలో దిగి.. ఆ తర్వాత నేరుగా నాంపల్లి వెళ్లిపోయారు. నాంపల్లి కోర్టుకు హాజరవుతున్న క్రమంలో జగన్ అభిమానులు ఉన్మాద ప్రదర్శన చేశారు. జగన్ ఫ్లెక్సీలు పట్టుకొని రఫ్ఫా రఫ్ఫా అంటూ నినాదాలు చేశారు. వాడెవడు.. వీడెవడు.. జగనన్నకు అడ్డు ఎవడు అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. ఇంకా కొందరైతే జగన్, కేటీఆర్ బొమ్మలను పక్కపక్కన ఏర్పాటు చేసి.. 2.0 లోడింగ్ అని రాస్కొచ్చారు.. ఆ తరహా ప్లెక్సీలను ఏర్పాటు చేసి ప్రదర్శించారు.

జగన్ బయటకు వచ్చిన ప్రతిసారి అతని అభిమానులు ఇలానే స్పందిస్తున్నారు.. అప్పట్లో ఏపీలో జగన్ పర్యటించిన ప్రాంతాలలో ఇదేవిధంగా హంగామా సృష్టించారు వైసీపీ కార్యకర్తలు.. జగన్ అభిమానులు.. చివరికి జగన్ కారు కింద పడిపోయి ఒక వ్యక్తి చనిపోయినప్పటికీ వైసీపీ కార్యకర్తలు ఏమాత్రం స్పందించలేదు. కనీసం అతడికి చికిత్స అందించాలనే సోయి కూడా వారికి లేకుండా పోయింది. ఆ తరహా మనస్తత్వం ఉన్న కార్యకర్తలను ఎలాంటి మనుషులు అనుకోవాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తెలంగాణలో హంగామా సృష్టించిన వైసిపి కార్యకర్తల మీద చర్యలు తీసుకోవాలని ఇప్పటికే టిడిపి నేతలు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.

Also Read:  జగన్ వస్తే జనం ఉండాల్సిందేనా?

జగన్ ఏపీ నాయకుడు కాబట్టి.. పైగా గత అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలు మాత్రమే సాధించాడు కాబట్టి అక్కడ రాజకీయ ప్రయోజనాల కోసం ఏమైనా చేయొచ్చు. ఎలాంటి ప్రదర్శనైనా చేయొచ్చు. కానీ ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఇంతటి రాజకీయ హడావిడి సృష్టించాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. జగన్ ఏదైనా ఉంటే తన ఆంధ్రప్రదేశ్లో చూసుకోవాలని.. ఇక్కడి నాంపల్లి కోర్టుకు విచారణకు హాజరైనప్పుడు.. ఇంత హడావిడి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ జగన్ మీద మోపిన అభియోగాలు తప్పు అనుకుంటే వెంటనే వాటికి తగ్గ ఆధారాలు చూపించాలి. అంతే తప్ప ఇలాంటి బల ప్రదర్శన చేస్తే ఉపయోగముండదని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular