Jagan Rare Chance Amaravati: ఏపీలో( Andhra Pradesh) చంద్రబాబును విపరీతంగా ద్వేషించడంలో జగన్మోహన్ రెడ్డి ముందుంటారు. అందులో ఎంత మాత్రం తప్పులేదు. ఎందుకంటే ఆయన రాజకీయ ప్రత్యర్థి కాబట్టి. తనను జైలు పాలు చేశారన్న కోపం, ఆగ్రహం జగన్లో ఉండి ఉండవచ్చు. అందుకే చంద్రబాబును 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉంచగలిగారు. అయితే అది వారిద్దరి మధ్య జరిగిన వ్యవహారం. కానీ చంద్రబాబుపై ఉన్న కోపం ఒక ప్రాంతం వైపు జగన్ చూపిస్తుండడం మాత్రం ఈ రాష్ట్రానికి ఎనలేని నష్టం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై విపరీతమైన ప్రభావం చూపుతుంది. అది ఎంత మాత్రం ఈ రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు.
ఐదేళ్లుగా అమరావతి నిర్వీర్యం..
అమరావతి రాజధాని( Amravati capital ) కి జై కొట్టారు జగన్. విపక్ష నాయకుడిగా నాడు అమరావతి ఎంపికలో చంద్రబాబు జగన్ అభిప్రాయాన్ని కోరారు. ప్రొసీడ్ అంటూ శాసనసభ వేదికగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అంతకుమించి భూ సమీకరణ చేయాలని సూచించారు. కానీ అధికారంలోకి వచ్చాక అదే అమరావతిని పడుకోబెట్టారు. పూర్తిగా ఆచేతనంగా మార్చేశారు. పోనీ తాను అనుకున్న మూడు రాజధానులనైన తెచ్చారా? నిర్మించారా? ఒక ఇటుక నైనా వేశారా? అంటే అది లేదు. కానీ విశాఖలోని రుషికొండను తొలగించి భారీ పాలస్ ను కట్టారు. కనీసం అలా ఓ రాజధాని నిర్మాణం అయినా ప్రారంభించి ఉంటే ఆయన విషయంలో ఇలా మాట్లాడుకుని ఉండే వారం కాదు.
Also Read: వివేకానంద రెడ్డి హత్య కేసు.. సుప్రీం తీర్పు పై వైసీపీ సైలెన్స్
మీడియాతో వెళితే సరి..
కూటమి( Alliance) అధికారంలోకి వచ్చింది. అమరావతి రాజధానిని ప్రారంభించింది. కానీ వరద ప్రాంతంలో అమరావతిని కట్టేస్తున్నారంటూ ప్రచారం మొదలు పెట్టింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. అదేపనిగా దుష్ప్రచారం మొదలుపెట్టారు కూడా. అయితే అవంతా దుష్ప్రచారమని కూటమి ప్రభుత్వం కొట్టి పారేస్తోంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి నివాసానికి కూత వేటు దూరంలో ఉంటుంది అమరావతి. తనకున్న మీడియా సపోర్ట్ తో అమరావతికి తీసుకెళ్లి.. ఏ ఏ ప్రాంతాలు నీళ్లలో మునిగిపోయాయో ప్రజలకు చూపిస్తే ఎనలేని మైలేజ్ వస్తుంది. అక్కడ రాజధాని కట్టడం తప్పన్న తన వాదనలను బలం పెంచుకున్నట్లు అవుతుంది. కానీ జగన్ ఆ పని చేయడం లేదు. ఆ పని చేయాలంటే అమరావతిలో ఆ పరిస్థితి ఉండాలి కదా? ఒకవేళ అమరావతి వెళ్లిన తన ఆత్మాభిమానం అడ్డు వస్తుంది. ఈ అమరావతిని అడ్డుపడ్డారో.. అదే ప్రాంతీయుల ఆగ్రహం కచ్చితంగా చవిచూస్తారు. అందుకే తెరవెనుక ఉండి.. అమరావతిపై విషం చిమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే పనిగా ప్రచారం చేస్తున్నారే తప్ప.. రుజువు చేయడానికి మాత్రం వెనుకడుగు వేస్తున్నారు.