Jabardasth comedian in Bigg Boss house: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పాపులారిటీని సంపాదించుకున్న రియాల్టీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షో అనే చెప్పాలి… ఇప్పటివరకు ఏ షోకి రాని రేటింగ్ ని సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ షో సక్సెస్ ఫుల్ గా 8 సీజన్లను కంప్లీట్ చేసుకొని ఇప్పుడు తొమ్మిదో సీజన్ ను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న చాలామంది సెలబ్రిటీలుగా మారిపోయారు. ప్రస్తుతం వాళ్లు సినిమాలను చేస్తూ టాప్ పొజిషన్లో ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట కూడా ఈ షోలో పాల్గొని వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశంలో మరి కొంతమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు… ఇక ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో కూడా చాలా మంచి పాపులాటిని సంపాదించుకుంది. గత 12 సంవత్సరాల నుంచి ఈ షో నిర్విరామంగా టెలికాస్ట్ అవుతూనే చాలామంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది. వాళ్ళంతా ఇప్పుడు సినిమాల్లోనూ, సిరీస్ ల్లోనూ నటిస్తూ బిజీగా మారిపోయారు. ఇక బిగ్ బాస్ షో లో ప్రతి సంవత్సరం ఎవరో ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్ ను అయితే తీసుకుంటుంటారు.
మరి ఈ సంవత్సరం కూడా ఒక జబర్దస్త్ షోలో కమెడియన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఒక నటుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనేది తెలుస్తోంది. ఇంతకీ ఆయన ఎవరు అంటే ఇమాన్యుయేల్ గా తెలుస్తోంది. ఆయన జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటిని సంపాదించుకున్నాడు.
Also Read: పీపుల్స్ స్టార్.. ఓ అలుపెరగని సినీ పేద బాటసారి..
ప్రస్తుతం జబర్దస్త్ షోలో వన్ ఆఫ్ ది టాప్ కమెడియన్ గా వెలుగొందుతున్నాడు. గతంలో సుడిగాలి సుదీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది లాంటి వాళ్ళు జబర్దస్త్ షోని తమ భుజస్కంధాల మీద మూసుకుంటూ ముందుకు తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు వాళ్ళు సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల జబర్దస్త్ షో చేయడానికి ఇష్టపడడం లేదు.
దాంతో ఇమాన్యుయల్ ఒక్కడే షో మొత్తాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఇమ్మాన్యూయల్ బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇస్తే కామెడీ తో పాటు అక్కడ ఎదురయ్యే టాస్కులు కూడా చాలా రసవత్తరంగా మారుతాయి అనే ఉద్దేశ్యంతోనే బిగ్ బాస్ టీం అతన్ని సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది…