Jagan I Pak: సాధారణంగా జగన్( Y S Jagan Mohan Reddy ) పర్యటన అంటేనే చాలా రకాల సీన్లు క్రియేట్ అవుతాయి. మొన్న ఆ మధ్యన ఆయన విజయవాడ జైలులో ఉన్న వల్లభనేని వంశీ మోహన్ ను పరామర్శించారు. ఆ సమయంలో జగన్ మామయ్య.. అంటూ ఓ చిన్నారి గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూ ఉంటుంది. చివరకు జగన్ ఎత్తుకొని ముద్దు పెట్టేసరికి సైలెంట్ అవుతుంది. అయితే తరువాత ఆ చిన్నారి గురించి అసలు నిజం తెలిసేసరికి అవాక్కు కావడం జనం వంతు అవుతుంది. అదంతా ఐప్యాక్ ఏర్పాట్లు అని తెలిసిపోయింది. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రేపటి పర్యటనపై అందరి అంచనాలు ఉన్నాయి.
చంటి సినిమాలో మీనా పాత్ర గురించి తెలుసు కదా? ఆమె ఇంటి నుంచి బయటకు వెళితే ఊర్లో ఉన్న పురుషులు కిందకు తలదించుకోవాల్సిందే. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంటుందని చెప్పలేం కానీ.. జగన్ జనాల్లోకి వస్తే ఐప్యాక్ టీం రంగంలోకి దిగాల్సిందే. ఐప్యాక్( I pak team ) మనుషులు రంగంలోకి దిగుతారు. ఎవరి పాత్రల్లో వారు లీనం అవుతారు. అయితే 2014 నుంచి 2019 వరకు ఐప్యాక్ నటనలు వర్కౌట్ అయ్యాయి. 2019 నుంచి 2024 మధ్య అంతా బాగున్నట్టే కనిపించాయి. కానీ 2024 నుంచి వారు చేసిన ప్రతి ప్రయత్నం వికటిస్తూనే ఉంది. అయితే జగన్ హాజరైన ప్రతి చోటా ఐపాక్ టీం అదే జనాలతో మమేకం అయిపోతుంది.
అయితే ఒక్క జగన్మోహన్ రెడ్డి తోనే కాదు. గతంలో లోకేష్( Lokesh ) తో కూడా ఈ ఐపాక్ టీం పనిచేసింది. ఆయన గురించి విస్తృతంగా ప్రచారం చేసింది. అయితే అది సానుకూలంగా కాదు. వ్యతిరేకంగానే ప్రచారం చేసింది. లోకేష్ పాదయాత్ర చేసిన సమయంలో వేలాదిమంది ఐప్యాక్ ప్రతినిధులు వ్యతిరేక ప్రచారానికి దిగారు. కానీ అది వర్క్ అవుట్ కాలేదు. అదే సమయంలో జగన్ సిద్ధం సభలను సైతం జాకీలతో పెట్టి లేపే ప్రయత్నం చేశారు. అది కూడా ప్రజల్లోకి వెళ్లలేదు. అధికారంలో ఉన్నప్పుడు అలా ఉంటే.. ఓటమి ఎదురయ్యేసరికి జగన్ చేసే ప్రతి ప్రయత్నం వికటిస్తూ వస్తోంది. ఐప్యాక్ చర్యలు ఇట్టే తెలిసిపోతున్నాయి. అయితే ఈరోజు తుఫాన్ బాధితుల పరామర్శకు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కృష్ణాజిల్లాలో తుఫాన్ బాధితులను పరామర్శించనున్నారు. దీంతో ఐపాక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందోనన్న టాక్ నడుస్తోంది. చూడాలి వారి ప్రయత్నాలు ఎలా ఉంటాయో..?