Homeఆంధ్రప్రదేశ్‌Minister Nara Lokesh : బుడమేరు విషయంలో.. లోకేష్ చేతులెత్తయడమే మంచిదయిందా..

Minister Nara Lokesh : బుడమేరు విషయంలో.. లోకేష్ చేతులెత్తయడమే మంచిదయిందా..

Minister Nara Lokesh : ఇటీవల వర్షాలకు బుడమేరు కు రికార్డు స్థాయిలో వరద వచ్చింది. పొరుగున ఉన్న ఖమ్మం నుంచి విపరీతమైన వరదరావడంతో బుడమేరు తారా స్థాయికి మించి ప్రవహించింది. ఫలితంగా విజయవాడ నగరం ముంపునకు గురైంది. దీంతో ప్రాంతంలో సహాయక చర్యలు సాగుతున్నాయి.. ఈ నేపథ్యంలో శుక్రవారం భారత ఆర్మీ రంగంలోకి దిగింది.. దానికంటే ముందు బుడమేరు విషయంలో ఏపీ మంత్రి లోకేష్ చేతులెత్తేయడంతో ఆర్మీ రంగంలోకి దిగింది. ఫలితంగా బుడమేరు సమస్యకు తాత్కాలికంగా ఒక పరిష్కారం లభించింది.

ఎగువ ఖమ్మం నుంచి భారీగా వరద నీరు రావడంతో బుడమేరుకు మూడు ప్రాంతాలలో గండ్లు పడ్డాయి. ఆ గండ్లు మొత్తం పూడ్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఆ బాధ్యతలను మంత్రులు లోకేష్, రామానాయుడుకు అప్పగించారు. వాటిని యుద్ద ప్రాతిపదికన ఎలా కూర్చోవాలి అనే విషయంలో తక్షణ ప్రణాళిక తయారుచేసి ముఖ్యమంత్రికి రామానాయుడు, లోకేష్ వివరించారు. ఇదే క్రమంలో ఆ మూడు గండ్లలో రెండు గండ్ల వద్ద రామానాయుడు, లోకేష్ తిష్ట వేశారు. అర్ధరాత్రి సమయం వరకు అక్కడే ఉండి వాటిని పూడ్పించారు. అయితే మూడవ గండి చాలా పెద్దది. ఇది పది నుంచి 15 మీటర్ల లోతు ఉంది. 100 మీటర్లకు పైగా పొడవు ఉంది. ఆ విషయంలో లోకేష్ పూర్తిగా చేతులెత్తేశారు..”ఇది చాలా పెద్ద గండి. దీనిని పూడ్చేసత్తా మన వద్ద లేదని” అధికారులతో స్పష్టం చేశాడు. తినే పద్యంలో గురువారం కేంద్రం నుంచి ఏరియల్ పరిశీలనకు వచ్చిన మంత్రి వద్ద విషయాన్ని వెల్లడించాడు. ఆర్మీని రంగంలోకి దింపాలని కోరాడు. దీంతో వెంటనే శుక్రవారం ఆర్మీ రంగంలోకి దిగింది. ఆ పనులు చేయడం మొదలుపెట్టింది.. దీంతో యుద్ధ ప్రాతిపదికన ఆ గండిని పూడ్చే పనులు మొదలయ్యాయి.

డాంబికాలకు పోలేదు

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో లోకేష్ డాంబికాలకు పోలేదు. మేమే చేస్తామని గొప్పలకు పోలేదు. వాస్తవాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లాడు. ప్రజల ప్రాణాలకు విలువ ఇచ్చి.. మరో వర్షం కురిస్తే జరిగే నష్టాన్ని అంచనా వేసి.. తక్షణమే నిర్ణయం తీసుకున్నాడు.. లోకేష్ విజ్ఞప్తితో ఆర్మీ మైలవరం, కొండపల్లి, కవులూరు వద్ద ఏర్పడిన బుడమేరు గండిని పూడ్చేందుకు అవసరమైన అన్ని పరికరాలతో వచ్చింది.. జరుగుతున్న పనులకు తమ వంతు సహకారాన్ని అందించింది.. బుడమేరు వద్ద జరుగుతున్న పనులను మంత్రి రామానాయుడు పరిశీలించారు. ఆర్మీ అధికారులతో మాట్లాడారు. బుడమేరు కట్ట చివరి నుంచి మూడో గండి పడిన ప్రాంతాన్ని ఆర్మీ క్షుణ్ణంగా పరిశీలించింది. పనులను మొదలుపెట్టింది.. శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు కూడా అక్కడ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఆ పనులు జరుగుతున్న తీరును స్థానికులు నిశితంగా పరిశీలిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మరో వర్షం పడితే విజయవాడ మళ్ళీ నీట మునగకుండా ఉండేందుకు చేపడుతున్న రక్షణ చర్యలను కొనియాడుతున్నారు. కొన్నిసార్లు మన వైఫల్యాన్ని ఒప్పుకోవాలి. మన స్థాయిని బట్టి మాట్లాడాలి. అప్పుడే పనులు జరుగుతాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular