https://oktelugu.com/

Tirupati laddoos row : అపచారం.. మహోపచారం!

ఆలయానికి వివిధ వస్తువులు సరఫరా చేసే కాంట్రాక్టర్లతో ఈవో శ్యామలరావు భేటీ అయిన సంద ర్భంలో ఆవు నెయ్యి కిలో ఎంతకు ఇస్తున్నారు? ఏదిఏమైనా భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకొని తిరుపతి లడ్డు పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే...

Written By:
  • NARESH
  • , Updated On : September 24, 2024 10:44 am

    Tirumala Laddu

    Follow us on

    * కల్తీ.. కల్తీ.. కల్తీ
    * ఎక్కడ చూసిన కల్తీ మయం
    * చివరకు పవిత్రమైన లడ్డూ తయారీలో సైతం కల్తీ

    Tirupati laddoos row : అంత్యంత పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ జరిగినట్లు వార్తలు రావడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. లడ్డూ తయారీలో వాడే నెయ్యి జంతువుల కొవ్వు నుంచి తీసిందని సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడంతో భక్తుల్లో ఆక్రోశం కట్టలు తెంచుకుంటోంది. ఈ వార్త అంతర్జాతీయంగా వైరల్ కావడంతో చార్చోప చర్చలు ఊపందుకున్నాయి. నిత్యం మనము తినే పెరుగన్నంలో చిన్న వెంట్రుక వస్తే తట్టుకోలేక పోతాం. శ్రీవారికి సమర్పించే రోజూ సమర్పించే నైవేద్యంలో కల్తీ చేయడం, జంతువుల మాంసం నుంచి తీసే నెయ్యి వాడుతున్నారనే విషయం భక్తులను తీవ్రంగా కలిచివేస్తోంది. అయితే ఈ విషయాన్ని గత ప్రభుత్వాన్ని విమర్శించేందుకు, అప్రతిష్ఠపాలు చేసేందుకు ఈ ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తూన్నట్లు వైసీపీ నేతలు కౌంటర్ చేస్తున్నారు. విమర్శలకు, ప్రతివిమర్శలకు ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం తిరుపతి లడ్డూ ప్రసాదంపై విమర్శించుకోవడం. రాజకీయం మైలేజీ కోసం ఎవరికివారే ఎదుటివారిని విమర్శించడం, దీనివల్ల భక్తుల మనోభావాలు దెబ్బతినడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో తిరుపతి లడ్డూ ఇమేజ్ పడిపోయే అవకాశం ఉంది. అయితే అతి సున్నితమైన ఇలాంటి అంశాలలో మీడియా ముందు మాట్లాడేటప్పుడు జాగరుకతతో ఉండాల్సి ఉంటుంది. ఆంధ్రా సీఎం చంద్రబాబు బహిరంగంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనె వాడినట్లు ఎనిమాల్ ఫాట్ అనే పదం వాడడంతో ఈ అంశం తెరమీదకు వచ్చింది. ప్రభుత్వాలు ఈ విషయం ఆలోచన లేకపోవడంపై వివిధ వర్గాల ప్రజల ఆందోళనకు కారణమైంది. ఈ విషయంపై సమగ్రమైన దర్యాప్తు జరిపి దోషులను శిక్షించే విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిందే.

    తిరుపతి లడ్డూ చరిత్ర
    ఈ సంఘటన ప్రకంపనలు పుట్టించడంతో తిరుపతి లడ్డూ చరిత్ర గురించి తెలుసుకోవాలని అందరిలో ఆసక్తి నెలకొంది. శ్రీవారి ప్రసాదమైన లడ్డూకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ లడ్డు పంపిణీ సుమారుగా 300 ఇళ్ల క్రితం ప్రారంభమైంది. 1715 ఆగస్టు 2 నాడు తొలిసారిగా లడ్డును తిరుమల ప్రసాదంగా భక్తులకు అందించారు. అంతకు ముందు లడ్డూ కు బదులుగా బూందీ అందించే వారు. క్రీస్తు శకం 1803లో ప్రారంభమైన తిరుపతి ఈ ప్రసాదం కాలక్రమేనా లడ్డూ గా మారినట్లు ఇక్కడి పండితులు చెబుతున్నారు. ఇక పల్లవుల కాలం నుంచి ప్రసాదాలు పంపిణీ చేసినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. విజయనగర సామ్రాజ్యంలో రెండోదేవరాయల కాలం నుంచి ప్రసాదాల సంఖ్య పెంచినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. కిలో నెయ్యి రూ.400లోపే ఎలా సాధ్యం? టీటీడీ అధికారులకు సందేహం రాలేదా?

    అసలేం జరిగింది..?
    ఆలయానికి వివిధ వస్తువులు సరఫరా చేసే కాంట్రాక్టర్లతో ఈవో శ్యామలరావు భేటీ అయిన సంద ర్భంలో ఆవు నెయ్యి కిలో ఎంతకు ఇస్తున్నారు? అనే చర్చ వచ్చింది. కాంట్రాక్టర్లు కిలో నెయ్యి రూ. 320 నుంచి రూ.424 మధ్య సరఫరా చేస్తున్నట్టు తెలియడంతో ఇంత తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేయడం ఎలా ‘సాధ్యమని సమావేశంలో ప్రశ్నలు తలెత్తాయి. వెంటనే ఆయన తిరుమలకు చేరుకున్న నెయ్యి ట్యాంకర్లను గుజరాత్ లోని ఆనంద్ పట్ట ణంలో ఉన్న జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్న ప్ర భుత్వ ఎన్టీబీ (నేషనల్ డైరీ డెవలప్మెంట్ బో ర్డు) ల్యాబు జూలై 6న రెండు, జూలై 12న మరో రెండు ట్యాంకర్ల శాంపిళ్లను పంపారు. వారి నుంచి వచ్చిన నివేదికల్లో నెయ్యి సరఫరా చేస్తున్న ఐదు సంస్థల్లో ఏఆర్ ఫుడ్స్ కంపెనీ ప్రమాణాలు పాటిం చడంలేదని.. వారు సరఫరా చేస్తున్న నెయ్యిలో జం తువుల కొవ్వును కలిసినట్టు నివేదిక వచ్చింది. ఆరో జు నుంచి ఈ విషయమై అంతర్గతంగా విచారణ కొనసాగుతూనే ఉన్నది. నాణ్యత ప్రమాణాలు లేవని తేలడంతో వెంటనే ఆ నే ఆ సంస్థ టెండర్లకు కూడా టీటీడీ రద్దు చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఈ వ్యవహారాన్ని చూసీచూడనట్టు ఎందుకు వదిలేశార న్నది భక్తులు ప్రశ్నిస్తున్నారు. టీటీడీకి సొంత ల్యాబ్ లేకపోవడంతో సరఫరాదారుల నుంచి వచ్చిన నెయ్యిని పరీక్షించే అవకాశమే లేకుండా పోయింది. సరిగ్గా ఈ అంశమే సరఫరాదారులకు వరంగా మారింది. అయితే, తాజాగా ఈ అంశంపై ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కా కుండా చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం నాణ్యమై న లడ్డూ భక్తులకు అందుతుందని స్పష్టం చేశారు. నెయ్యి నాణ్యతను ఎప్పటికప్పుడు తెలుసుకోవడా నికి అడఈట్రీ ల్యాబ్ టెస్ట్ ఇక్విప్మెంట్ను విరాళంగా ఇచ్చేందుకు ఎన్డీబీ ముందుకు వచ్చిందని తెలిపారు. ఈ మేరకు విదేశాల నుంచి సంబంధిత యంత్రాలు రావాల్సి ఉందన్నారు..

    ఏదిఏమైనా భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకొని తిరుపతి లడ్డు పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే…

    – దహగాం శ్రీనివాస్
    ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్