Chandrababu Latest News: కాచిన చెట్టుకే రాళ్ల దెబ్బలు అంటారు. ఇది నిజంగా సత్యం కూడా. పరీక్ష రాస్తే కదా తప్పులు, ఒప్పులు తెలిసేది. కానీ పరీక్ష రాయను.. నేను తెలివైన వాడిని అంటే ఎలా? అయితే చంద్రబాబు విషయంలో సైతం ఇటువంటి ప్రచారమే జరుగుతోంది. ఆయన ఎప్పుడు డెవలప్మెంట్ అనే అంశంపైనే ఫోకస్ పెడతారు. దానినే నమ్ముకుంటారు. కానీ దానిని గుర్తించే స్థితిలో ప్రజలు లేరు. అంతెందుకు టీడీపీ శ్రేణులు కూడా అలానే ఉంటాయి.బాబుగారు ఎప్పుడు డెవలప్ మెంట్ అంటారు. అని చాలా తేలిగ్గా తీసుకుంటారు. కానీ గత ముఖ్యమంత్రుల విజన్, చంద్రబాబు ఆలోచనలతో సరిపోల్చుకుంటే ఆయనను ఎవరూ పల్లెత్తు మాట అనలేరు కూడా. చంద్రబాబు హైదరాబాద్ ను ఎంతగానో డెవలప్ చేశారు. సైబరాబాద్ ను కట్టారు. దానిని కూడా తప్పుపట్టే వారు అధికమయ్యారు. అక్కడ పెట్టుబడులు పెట్టడం వల్లే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చిందని విశ్లేషించే వారు ఉన్నారు. అదే జరిగితే తెలంగాణ ప్రజలు ఎందుకు ఆయన విషయంలో భిన్నంగా ఉంటారు? ఇది మాత్రం చెప్పరు.
అన్ని ప్రాంతాల్లో డెవలప్ మెంట్..
రాష్ట్రం నిలదొక్కుకోవాలంటే ఇంజన్ లాంటి ఒక ఆర్థిక వ్యవస్థ అవసరం. అందుకే అప్పుడు హైదరాబాద్ లో (Hyderabad) ఐటీ పరిశ్రమలను డెవలప్ చేశారు. అయితే ఇప్పుడు అటువంటి విమర్శ రాకుండా ఉండేందుకు ఏపీలో అన్ని ప్రాంతాలను సమ ప్రాధాన్యంగా తీసుకుంటున్నారు. విశాఖలో ఐటీ పరిశ్రమలను డెవలప్ చేశారు. రాయలసీమలో తయారీ పరిశ్రమలు పెడుతున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా సరికొత్త విమర్శను తెరపైకి తెచ్చారు. అమరావతికి పెట్టుబడులు రావడం లేదని కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. అది కూడా వైసీపీ పెంచి పోషిస్తున్న కుహానా మేధావులు, విశ్లేషకుల రూపంలో ఉన్నవారే ఇటువంటి కొత్త థియరీలను తెరపైకి తెస్తూ చంద్రబాబుకు క్రెడిట్ దక్కనీయకుండా చేసే పనిలో పడ్డారు. అయితే ఆ ట్రాప్ లో టీడీపీ శ్రేణులు కూడా పడుతుండడం ఇప్పుడు గుర్తించాల్సిన విషయం.
ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్..
జగన్మోహన్ రెడ్డి (YS JaganamohanReddy)పాలనలో సంక్షేమంతో నడిచింది. వాటి మాటునే విధ్వంసాలు నడిచాయి. కానీ ప్రజలు గుర్తించరని భావించారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అయితే చేసింది చెప్పుకోలేకపోయామని జగన్ బాధపడుతున్నారు. కానీ చెప్పకపోయిన ప్రజలు గుర్తించి వాతలు పెట్టారు. అయితే ఇప్పడు చంద్రబాబు ఒక విజన్ తో పనిచేస్తున్నారు. ఇప్పుడు కూడా గుర్తించకపోతే ఎలా? అందునా టీడీపీ వాళ్లే థియరీలు తీస్తున్నారు. చంద్రబాబు పెట్టుబడులు తెస్తే ఒక ప్రాంతానికే తెచ్చారంటారు. తేకపోతే ఏం చేయలేదని కొత్త సందేహాలను పెడతారు. పెట్టుబడుల సదస్సు పెడితే ప్రయాసగా చెబుతారు. పెట్టకపోతే ఏ ప్రయత్నం చేయలేదంటారు. చంద్రబాబు వయసుకు మించి, శక్తికి మించి పనిచేస్తుంటే ఆయన చేసే ప్రతి పనిలో వంకరలను వెతుకుతున్నారు. లోపాలను బూతద్ధంలో పెట్టి చూస్తున్నారు. ఇందులో టీడీపీ కుహానా మేథావులు గొంతు కలిపితే అంతకంటే అన్యాయం మరొకటి ఉండదు.