https://oktelugu.com/

BJP – Kapus : కాపులకు బీజేపీ దూరమవుతోందా?

కానీ గతం కంటే బీజేపీకి ఓట్ల శాతం పెరిగినట్టు చెప్పి నేతలు సంతృప్తి పడేవారు. కాపులు బీజేపీని ఆదరించకపోవడంతో హైకమాండ్ పునరాలోచనలో పడింది. మరెందుకు కాపుల కోసం వెంపర్లాడడం అని ఒక నిర్ణయానికి వచ్చింది. అందుకే కాపు సామాజికవర్గం వద్ద ఉన్న నాయకత్వాన్ని లాగేసుకొని కమ్మ సామాజికవర్గానికి అప్పగించింది.

Written By:
  • Dharma
  • , Updated On : July 7, 2023 8:39 am
    Follow us on

    BJP – Kapus : ఏపీ రాజకీయాలకు సంబంధించి కాపు సామాజికవర్గంపై ఇన్నాళ్లూ బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఏపీలో అధికారం చెలాయిస్తున్న రెండు సామాజికవర్గాలకు కాదని.. మూడో సామాజికవర్గంగా ఉన్న కాపులను తమవైపు తిప్పుకుంటే పార్టీకి భవిష్యత్ ఉంటుందని హైకమాండ్ భావించింది. అందుకే రాష్ట్ర విభజన తరువాత కాపు సామాజికవర్గానికి బీజేపీ ప్రాధాన్యత ఇచ్చింది. 2014లో కన్నా లక్ష్మీనారాయణ, అటు తరువాత సోము వీర్రాజుకు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టడం వెనుక వ్యూహం అదే. బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని కాపు సామాజికవర్గం నేతలకు అప్పగిస్తే.. ఆటోమేటిక్ గా పార్టీ బలపడుతుందని బీజేపీ అగ్రనేతలు భ్రమపడ్డారు.

    అయితే బీజేపీ అంచనా తప్పింది. దానికి అనేక కారణాలున్నాయి. కాపు ఓటు బ్యాంక్ పై ఏపీలో త్రిముఖ దాడి జరిగింది. ఎవరికి ఎన్ని ఓట్లు ఉండాలో అన్ని ఉన్నాయి. వాస్తవానికి ఏ ప్రభుత్వం కొలువుదీరినా కాపులకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇస్తున్నారు. కేబినెట్ లో సముచిత మంత్రి పదవులు కేటాయిస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లో సైతం పెద్దపీట వేస్తున్నారు. అదే సమయంలో జనసేన రూపంలో పవన్ కాపులను ఓన్ చేసుకున్నారు. ఇప్పుడిప్పుడే కాపు సామాజికవర్గమంతా పవన్ కు పోలరైజ్ అవుతోంది. దీంతో బీజేపీ లాభం లేదన్న నిర్ణయానికి వచ్చింది.

    గత నాలుగేళ్లుగా కాపుల కోసం బీజేపీ చేయని ప్రయత్నం లేదు. కానీ పెద్దగా వర్కవుట్ అయిన దాఖలాలు లేవు. దాదాపు రాష్ట్రంలో వివిధ కారణాలతో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీచేసింది. ఈ నియోజకవర్గాల్లో కాపుల ఓట్లు అధికం. కానీ ఎక్కడా డిపాజిట్లు దక్కించుకున్న దాఖలాలు లేవు. కానీ గతం కంటే బీజేపీకి ఓట్ల శాతం పెరిగినట్టు చెప్పి నేతలు సంతృప్తి పడేవారు. కాపులు బీజేపీని ఆదరించకపోవడంతో హైకమాండ్ పునరాలోచనలో పడింది. మరెందుకు కాపుల కోసం వెంపర్లాడడం అని ఒక నిర్ణయానికి వచ్చింది. అందుకే కాపు సామాజికవర్గం వద్ద ఉన్న నాయకత్వాన్ని లాగేసుకొని కమ్మ సామాజికవర్గానికి అప్పగించింది.