Turmeric Oil: పసుపును వంటల్లో వాడటానికి మాత్రమే కాదు చర్మ సౌందర్యానికి వాడుతుంటారు. దీని వల్ల ముఖ సౌందర్యం మీ సొంతం అవుతుంది. అంతేకాదు ఈ పసుపుతో నూనె కూడా తయారు చేస్తారు. పసుపు వల్ల చర్మానికి చాలా బెనిఫిట్స్ అందుతాయి. పసుపు నూనెలో పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మీ చర్మ సౌందర్యాన్ని కాపాడుతాయి.
అయితే పసుపు నూనెలో కర్కుమిన్ ఉంటుంది. ఇది పవర్ ఫుల్ శోథ నిరోధక సమ్మేళనం కాబట్టి చర్మానికి అప్లై చేస్తే మొటిమలు, తామర, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు తగ్గుతాయి. దీంతో పాటు వాపు, ఎరుపు సమస్యలు కూడా తగ్గుతుంటాయి అంటారు నిపుణులు. పసుపునూనెలో యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్‌ని బ్యాలెన్స్ చేస్తాయి కాబట్టి చర్మ కణాలకి ఆక్సీకరణ నష్టం జరగకుండా ఉంటుంది. దీనివల్ల వృద్ధాప్య ఛాయలు, గీతలు, మడతలు, మచ్చల్ని దూరం చేస్తుంది. దీని వల్ల చర్మం యవ్వనంగా మారుతుంది.
పసుపునూనెలో అవసరమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్స్ ఉంటాయి. ఇవి చర్మానికి పోషణని అందించి హైడ్రేట్ చేస్తుంటాయి. దీని వల్ల స్కిన్ మృదువుగా, హైడ్రేట్‌గా ఉంటూ చర్మం అందంగా మారుతుంది. పసుపునూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు మొటిమలని కలిగించే బ్యాక్టీరియాతో పోరాడతాయి. దీని వల్ల సెబమ్ ఉత్పత్తి కంట్రోల్ లో ఉంటుంది. ఈ పసుపు నూనెను రాయడం వల్ల చర్మ రంధ్రాలు, బ్రేక్ అవుట్స్ తగ్గిపోతుంటాయి. పసుపు నూనెని రెగ్యులర్‌గా అప్లై చేస్తే చర్మం క్లియరై కాంతివంతంగా ఉంటుంది.
ఈ పసుపు నూనెలో చర్మాన్ని కాంతివంతంగా మార్చే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖంపై డార్క్ స్పాట్స్, హైపర్ పిగ్మెంటేషన్, మొటిమల మచ్చలను తొలగించడంలో తోడ్పడుతాయి. ఎందుకంటే, ఇది మెలనిన్ ఉత్పత్తిని నిరోధించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.