Nara Lokesh: రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనకు అవకాశం కల్పించాలని భావిస్తోంది కూటమి ప్రభుత్వం( Alliance government ). పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నంలో ఉంది. మల్టీ నేషనల్ కంపెనీలకు ఆహ్వానం పలుకుతోంది. అందులో భాగంగా ప్రపంచ దిగ్గజ విమాన తయారీ సంస్థ ఎయిర్ బస్ బోర్డు ఉన్నత స్థాయి సమావేశానికి మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఎయిర్ బస్ చైర్మన్ రెని ఓబెర్మన్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ కీలక ప్రతిపాదనలు చేశారు. పెట్టుబడులకు ఏపీ అనువైన రాష్ట్రమని.. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. కూటమి ప్రభుత్వ విధానాలను వివరించారు. లోకేష్ తో పాటు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు.
* లోకేష్ ట్వీట్
ఎయిర్ బస్ బోర్డు( Airbus board ) ప్రతినిధులతో సమావేశం విజయవంతం అయినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఎయిర్ బస్ బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ఏరో స్పేస్ పాలసీని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి వివరించారు లోకేష్. ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయడానికి, గ్లోబల్ క్వాలిటీ మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కు ఏపీ అనుకూల విధానాలు వివరించే ప్రయత్నం చేశారు. అందుకే ఏపీలో ఎయిర్ బస్, ప్రపంచ స్థాయి ఏరో స్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి అనుసంధానంగా సప్లై చైన్ లో ఎండ్ టు ఎండ్ అనుసంధానం కోసం టైర్ 1, టైర్ 2 ప్రొడక్షన్ యూనిట్ల ఏర్పాటు పై దృష్టి సారించాలని కోరారు నారా లోకేష్. అదే విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు.
* సానుకూల స్పందన..
అయితే లోకేష్( Minister Nara Lokesh) ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించింది ఎయిర్ బస్ ప్రతినిధుల బృందం. పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తే అంత సిద్ధం చేసిన భూమిని ఇస్తామని లోకేష్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. దీనివల్ల ప్లగ్ అండ్ ప్లే విధానంలో వెంటనే కరికాల పాలు ప్రారంభించవచ్చని వివరించారు. ఏపీని ఏరోస్పేస్ ఎగుమతులకు అనువైన విధానంగా చేసేందుకు అన్ని వనరులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సంస్థ కార్యకలాపాల కోసం ఎయిర్పోర్టులు, కోర్టులు, లాజిస్టిక్స్ కు అనుసంధానంగా ఉండే మల్టీ కారిడార్లు అందుబాటులోకి ప్రస్తామన్నారు మంత్రి నారా లోకేష్. ఏపీలో ఇంటిగ్రేటెడ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. మొత్తానికి అయితే పెట్టుబడులు ఆకర్షించేందుకు ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారు మంత్రి నారా లోకేష్. మరి అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయో? చూడాలి.
From Amaravati to Delhi, met the Airbus Board led by Chairman René Obermann for a focused engagement on anchoring a world-class aerospace manufacturing ecosystem in Andhra Pradesh. With ready land, a progressive aerospace policy, multi-corridor options, and co-located vendor… pic.twitter.com/KYBvWIUenC
— Lokesh Nara (@naralokesh) September 30, 2025