https://oktelugu.com/

Adani Group: అదానీ వ్యవహారంలో ఆ మీడియా అంకమ్మ శివాలెత్తుతోంది గాని.. చంద్రబాబు స్టాండ్ తెలిస్తే షాక్ అవ్వక తప్పదు..

" అదానీ మంచోడు కాదు. అడ్డగోలుగా ప్రభుత్వ వనరులు దోచుకునే ప్రయత్నం చేశాడు. నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదానీ కి రెడ్ కార్పెట్ పరిచింది. ఇష్టానుసారంగా రాయితీలు ఇచ్చింది. ఇప్పుడు ఆ భాగోతాలు బయటపడుతున్నాయి" ఇదీ ఈరోజు ఓవర్గం మీడియా అదానీ వ్యవహారం మీద రాసిన రాతలు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 22, 2024 2:19 pm
    Adani Group(4)

    Adani Group(4)

    Follow us on

    Adani Group: ఆ మీడియా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి అనుకూలంగా ఉంటుందని జనాల్లో ఎప్పటినుంచో అభిప్రాయం ఉంది.. (అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నడిచే మీడియా సుద్ధ పూస అని కాదు). ఆ మీడియా అదానీ వ్యవహారాల మీద బొంబాట్ వార్తలను ప్రచురించింది. పేజీలకు పేజీలకు కుమ్మేసింది. కానీ ఇక్కడ ఆ మీడియా మర్చిపోయింది ఒకటే.. అదానిపై కేసు నమోదయింది అమెరికాలో. అక్కడ ఆ కేసు విచారించాల్సింది ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్.. కానీ ఈ విషయాన్ని మర్చిపోయి ఆ మీడియా అలా రాయడం నిజంగా.. జర్నలిజం ప్రమాణానికి పూర్తి వ్యతిరేకం. ఆ మీడియా సంగతి అలా ఉంచితే..అదానీ వ్యవహారంలో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వ్యతిరేకంగా స్టాండ్ తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అదా నీ వ్యవహారంలో కేంద్రం ఎలా స్పందిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు కీలకంగా ఉన్నారు. అలాంటప్పుడు ఇండియాకు వ్యతిరేకంగా చంద్రబాబు గట్టి స్టాండ్ తీసుకునే పరిస్థితి లేదు. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదాని పెట్టుబడులు ఉన్నాయి. పలు సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటి పరిధిలో వేలాది మంది పనిచేస్తున్నారు. ఆ కంపెనీలను మరింతగా విస్తరించినందుకు ఆదాని గ్రూప్ ప్రణాళికలు రూపొందిస్తోంది. అలాంటప్పుడు చంద్రబాబు అదాని గ్రూప్ పై వ్యతిరేక స్టాండ్ తీసుకొని వచ్చే పెట్టుబడులను అడ్డుకునే పరిస్థితి ఉండదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

    ఆ మీడియా రాసింది గాని

    ఓ వర్గం మీడియా అదాని గ్రూప్ మీద అంకమ్మ శివాలుగా వార్తలు రాసినప్పటికీ.. చంద్రబాబు ఆ దిశగా అడుగులు వేస్తారు అనుకోవడానికి లేదు. పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అదానీ గ్రూప్ నుంచి పెట్టుబడులను తిరస్కరించే అవకాశం లేదు. ” ఆదాని గ్రూప్ విషయంలో నేరుగా ప్రధానమంత్రి కల్పించుకుంటున్నారు. పైగా న్యూయార్క్ పోలీసులు నమోదు చేసిన అభియోగాలను జాతీయ కోణంలో కేంద్ర పెద్దలు ప్రొజెక్టు చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఆదాని వ్యవహారంలో అరెస్టులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ లో పనిచేస్తున్న వారే జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ కేసును నమోదు చేసిన న్యూయార్క్ అధికారులు ఆదాని అవినీతి వ్యవహారాలను నిరూపించాల్సి ఉంటుంది. అది సాధ్యమయ్యే పని కాదు. పైగా ఒక నెల తర్వాత ట్రంప్ అధికారంలోకి వస్తారు. ట్రంప్ ఎలాగూ మోడీకి అత్యంత సన్నిహితుడు కాబట్టి.. అంత సులభంగా విచారణ జరిగే పరిస్థితి ఉండదు. పైగా మనదేశంలో దర్యాప్తు సంస్థలు ఎలా పనిచేస్తున్నాయో.. అమెరికాలో కూడా అంతే. అమెరికా ఇప్పటికిప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా నడుచుకునే పరిస్థితి లేదు. పైగా ఆదాని కూడా అమెరికాలో భారీగా పెట్టుబడులు పెట్టి కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇన్ని చిక్కుముళ్లు ఉన్నప్పుడు అదానికి ఏదో అవుతుందని అనుకోవడం భ్రమ” అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో హిండేన్ బర్గ్ నివేదిక వచ్చినప్పుడు ఇలానే హడావిడి జరిగిందని.. ఇప్పుడు కూడా కొద్ది రోజులు హడావిడి జరుగుతుందని.. ఆ తర్వాత చప్పున చల్లారిపోతుందని వారు అంటున్నారు. స్థూలంగా చూస్తే ఆదాని విషయంలో ఓవర్గం మీడియా ఎగిరెగిరి వార్తలు రాస్తున్నప్పటికీ.. అవి కొద్ది రోజుల వరకే పరిమితమవుతాయని.. ఆ తర్వాత యధాతధ స్థితి నెలకొంటుందని చెబుతున్నారు.