Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Hyderabad Biryani: హైదరాబాద్‌ బిర్యానీని నేనే ప్రమోట్‌ చేశాను: చంద్రబాబు

Chandrababu Hyderabad Biryani: హైదరాబాద్‌ బిర్యానీని నేనే ప్రమోట్‌ చేశాను: చంద్రబాబు

Chandrababu Hyderabad Biryani: హైదరాబాద్‌.. ప్రస్తుతం విశ్వనగరం.. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారు. 400 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న హైదరాబాద్‌ నగరానికి బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకురావడంలో గత పాలకుల కృషి కాదనలేనిది. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా నారా చంద్రబాబునాయుడు హైదరాబాద్‌కు ఐటీ సంస్థలు రావడంలో విశేష కృషి చేశారు. ఇది ఎవరూ కాదనలేని సత్యం. హైటెక్‌సిటీ నిర్మాణం.. ఐటీ కంపెనీలు, సీజీజీల ఏర్పాటుకు ఆయన ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థల యజమానులతో చర్చించి ఒప్పించి హైదరాబాద్‌కు రప్పించారు. ఇప్పుడు ఇదే స్ఫూర్తితో ఏపీలోనూ వివిధ సంస్థలతో కంపెనీలు ఏర్పాటు చేయించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నవంబర్‌ 14న ప్రపంచంలోని వివిధ దేశాల ప్రతినిధులతో వైజాగ్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందదర్భంగా గురువారం(నవంబర్‌ 13న) విజయవాడలో జరిగిన మైనారిటీ సంక్షేమ దినోత్సవ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పాలనలో హైదరాబాద్‌ అభివృద్ధి గురించి మరోసారి విపులంగా ప్రస్తావించారు. ఓల్డ్‌ సిటీ ప్రాంతానికి సమీపంలోనే ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం చేపట్టిన విషయాన్ని గుర్తుచేసి, ఆ నిర్ణయం వల్లే ముస్లిం వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలు లభించాయని తెలిపారు.

బ్రాండ్‌ను ప్రపంచానికి చాటిన సీబీఎన్‌..
హైదరాబాద్‌ ముత్యాలు, ఓల్డ్‌ సిటీ బజార్లు, బిర్యానీ వంటి ఐకానిక్‌ అంశాలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేలా చంద్రబాబు నాయుడు ప్రోత్సహించారు. ఆ కాలంలో వీటిని మార్కెటింగ్‌ కోణంలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు మాత్రమే కాకుండా, పర్యాటక ఆకర్షణలుగా గుర్తింపు తెచ్చేలా ప్రయత్నాలు జరిగాయన్నది వాస్తవం. ఈ క్రమంలో చార్మినార్‌ చుట్టూ అభివృద్ధి ప్రాజెక్టులు, ముత్యాల పరిశ్రమకు ప్రోత్సాహం, ఫుడ్‌ టూరిజం విభాగాల మద్దతు కీలక పాత్ర పోషించాయి.

మారిన హైదరాబాద్‌ ఆర్థిక స్థితిగతులు..
చంద్రబాబు పాలనలో ఇన్ఫ్రాస్ట్రక్చర్‌తోపాటు ఆర్థిక వృద్ధికి అనుకూలమైన వాతావరణం నెలకొని, పాతబస్తీ వ్యాపారులు వినియోగదారుల మారుతున్న ధోరణులకు అనుగుణంగా ఎదిగారని ఆయన వ్యాఖ్యానించారు. అది ముస్లిం వ్యాపార వర్గాల సాధికారతకు దారితీసిందని ఆయన పేర్కొనడం రాజకీయ సందేశంగా మారింది.

ముస్లింల సంక్షేమానికి కృషి..
మైనారిటీ సంక్షేమం కేవలం సహాయం కాదు, ఆర్థిక స్థాయిలు పెంచే అవకాశాల వేదికగానే పరిగణించాలనే ఆలోచనను చంద్రబాబు నాయుడు ఆనాడే చేశారు. హైదరాబాద్‌ నగరాన్ని సాంస్కృతిక, వ్యాపార కేంద్రంగా మార్చడంలో ఆ దృక్పథం ఉన్నదని వివరించారు. హైదరాబాద్‌ అభివృద్ధి తన కాలం నుండి ప్రారంభమైందని, ఆ వారసత్వాన్ని కొనసాగించడమే తాను చేసిన పని అని వెల్లడించడం ద్వారా తన కృషిని మరోసారి గుర్తు చేశారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version