https://oktelugu.com/

Renu Desai : ఎల్లప్పుడూ నీ కోసం నేనుంటా.. రేణు దేశాయ్ పోస్ట్ తో పవన్ కళ్యాణ్ అంశం తెరపైకి, సంచలనం రేపుతున్న పోస్ట్!

నటి రేణు దేశాయ్ సోషల్ మీడియా పోస్ట్స్ ఆసక్తి రేపుతూ ఉంటాయి. తాజాగా ఆమె ఎల్లప్పుడూ నీకోసం నేనుంటా అంటూ ఓ ఫోటో షేర్ చేశాడు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అంశం తెరపైకి వచ్చింది. ఆ మేటర్ ఏమిటో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : August 30, 2024 / 09:04 PM IST

    Renu desai Post

    Follow us on

    Renu Desai : రేణు దేశాయ్ బద్రి మూవీతో హీరోయిన్ గా పరిచయమైంది. దర్శకుడు పూరి జగన్నాధ్ ఆమెకు హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. బద్రి మూవీ సూపర్ హిట్. ఆ మూవీ సెట్స్ లో పవన్ కళ్యాణ్ తో ఆమె ప్రేమలో పడింది. రేణు దేశాయ్-పవన్ కళ్యాణ్ వివాహం చేసుకున్నారు. వీరికి అకీరా, ఆద్య సంతానం. వ్యక్తిగత కారణాలతో మనస్పర్థలు తలెత్తిన నేపథ్యంలో రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకుని విడిపోయారు. విడాకుల అనంతరం రేణు దేశాయ్ పిల్లలతో పాటు పూణే కి వెళ్ళిపోయింది. అక్కడే ఆమె చాలా కాలం ఉన్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్ హైదరాబాద్ లోనే ఉంటుంది.

    ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. గత ఏడాది విడుదలైన టైగర్ నాగేశ్వరరావు మూవీలో ఓ కీలక రోల్ చేసింది. దర్శకత్వం చేసే ఆలోచన కూడా తనకు ఉన్నట్లు రేణు దేశాయ్ చెప్పడం విశేషం. మరోవైపు రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటారు. ఆమె సామాజిక, రాజకీయ అంశాల మీద స్పందిస్తారు. ఆమె మానవతావాది. జీవహింసకు వ్యతిరేకం.

    రేణు దేశాయ్ తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఎల్లప్పుడూ నేనుంటా.. అంటూ యానిమల్ లవర్ తో దిగిన ఫోటో షేర్ చేసింది. ఈ పోస్ట్ ని కొందరు పవన్ కళ్యాణ్ కి ఆపాదిస్తున్నారు. ఈ కామెంట్ చూస్తే నీ కోసం ఎప్పటికీ ఎదురు చూస్తూ ఉంటానని పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్ చెప్పినట్లు ఉంది. వీరిద్దరూ మంచి జంట. విడిపోకుండా ఉండాల్సింది. పిల్లల్ని ఎంతగానో ప్రేమించే పవన్ కళ్యాణ్ భార్యకు ఎందుకు విడాకులు ఇచ్చాడో అర్థం కాదు.. అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

    రేణు దేశాయ్-పవన్ కళ్యాణ్ విడిపోయినప్పటికీ స్నేహం కొనసాగిస్తున్నారు. పిల్లల కోసం వారు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. కొడుకు అకీరాను త్వరలో హీరోగా లాంచ్ చేసే అవకాశం కలదు. 20 ఏళ్ల అకీరా చదువు కూడా పూర్తి అయినట్లు సమాచారం. దాంతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడట. ఆల్రెడీ అకీరా ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశాడు. మ్యూజిక్ కూడా నేర్చుకున్నాడు.

    పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ అయిన నేపథ్యంలో అకీరా అరంగేట్రం చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూడు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. హరి హర వీరమల్లు పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. అలాగే దర్శకుడు సుజీత్ ఓజీ టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. డీవీవీ దానయ్య తెరకెక్కిస్తున్నాడు. అలాగే దర్శకుడు హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నారు. త్వరలో ఈ మూవీ షూటింగ్స్ పవన్ కళ్యాణ్ తిరిగి ప్రారంభించనున్నారు.