CM Revanth Reddy : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి హైదరాబాద్‌లో నిర్మించుకున్న ఇల్లు లోటస్‌పాండ్. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన కుటుంబం ఇందులోనే ఉండేది. ఆయన మరణం తర్వాత వైఎస్సార్ తనయుడు జగన్, తనయ షర్మిల, భార్య విజయమ్మ ఇందులోనే ఉన్నారు. తర్వాత తెలంగాణ ఉద్యమం.. రాష్ట్ర విభజన జరగడంతో జగన్ కుటుంబం ఏపీలోనూ ఇల్లు నిర్మించుకుంది. అయితే అప్పుడప్పుడు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌కు వచ్చేది. 2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్, షర్మిల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో తెలంగాణకు వచ్చిన షర్మిల లోటస్ పాండ్‌లోనే ఉంటూ.. వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి రాజకీయాలు నెరిపారు. పాదయాత్ర చేశారు. కానీ, ఎంత ప్రయత్నించినా తెలంగాణలో మైలేజీ రాకపోవడంతో 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వెళ్లారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేశారు. అయినా ఆమె లోటస్ పాండ్‌లోనే ఉంటున్నారు. ఇక 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్ లోటస్‌పాండ్‌కు రాకుండా.. బెంగళూరులోని ఇంటికి వెళ్తున్నారు. దీంతో లోటస్‌పాండ్ షర్మిలకే అన్న ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు నివాసం ఉన్న ఈ లోటస్‌పాండ్‌పై ఇప్పుడు హైడ్రా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఏపీ ప్రస్తుత సీఎం చంద్రబాబు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఈ ప్రచారం మరింత హీటెక్కింది. గత కొన్ని రోజులుగా హైడ్రా హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌కు కూడా హైడ్రా నోటీసులు జారీ చేసిందని వార్తలు వస్తున్నాయి.
అక్రమ నిర్మాణాల కూల్చివేత..
హైదరాబాద్‌ను ఫ్యూచర్ సిటీగా మార్చడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారు. కబ్జా అయిన చెరువులు, కుంటలను చెర విడిపిస్తున్నారు. ఇప్పటికే 43 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. అనేక భవనాలకు నోటీసులు కూడా ఇచ్చారు. ఆక్రమణల కూల్చివేతతో హైడ్రా అనతికాలంలోనే ప్రజాదరణ పొందింది. హైడ్రా కమిషనర్ ప్రత్యేకంగా ఎలాంటి ఒత్తిడికి తలొగ్గకుండా, సామాన్యులు, ప్రముఖులు అనే తేడా లేకుండా ఆక్రమణలు ఎవరు చేసినా కూల్చివేస్తున్నారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని ఆక్రమణలపైనే హైడ్రా ఫోకస్ పెట్టింది. ఉక్కుపాదాన్ని మోపుతోంది. ఈ క్రమంలో ఏపీ మాజీ సీఎం జగన్‌కు కూడా హైడ్రా నోటీసులు ఇచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లో జగన్‌కు చెందిన లోటస్ పాండ్ కూల్చివేతకు హైడ్రా రంగం సిద్ధం చేసిందంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దాన్ని హైడ్రా కూల్చివేస్తుందని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
స్పందించిన రంగనాథ్..
లోటస్ పాండ్‌కు హైడ్రా నోటీసులు అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కమిషనర్ రంగనాథ్ స్పందించారు. తాము వైఎస్ జగన్‌కు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. ఇటీవలే కాంగ్రెస్ సర్కార్ వైఎస్.జగన్‌కు చెందిన లోటస్ పాండ్ ముందు కొన్ని కట్టడాలను కూల్చివేసింది. లోటస్ పాండ్ ముందు తన సెక్యూరిటీ కోసం నిర్ణంచిన కట్టడాలను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేశారు. రోడ్డుపైకి కట్టడాలు ఉన్నాయని స్థానికులు ఫిర్యాదు చేయగా అధికారులు కూల్చివేశారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Hyrda notices to jagans house lotus fund for demolition of illegal structures
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com