Visakhapatnam: విశాఖ తీరంలో సంచలనం.. 25 వేల కిలోల డ్రగ్స్.. తెరపైకి టీడీపీ నేతల పేర్లు?

జర్మనీలోని హంబర్గ్ మీదుగా ఈనెల 16న సముద్ర మార్గంలో ఈ కంటైనర్ విశాఖ చేరుకున్నట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. ఈనెల 19న నార్కోటిక్స్ సామాగ్రి, నిపుణులతో వచ్చిన సిబిఐ అధికారుల బృందం..

Written By: Dharma, Updated On : March 22, 2024 10:33 am

Visakhapatnam

Follow us on

Visakhapatnam: విశాఖ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడటం సంచలనం సృష్టించింది. ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయ్యింది. బ్రెజిల్ నుంచి విశాఖలోని ఓ ప్రైవేటు ఆక్వా ఎక్స్పోర్ట్స్ కు వచ్చిన కంటైనర్ లో 25 వేల కిలోల మత్తు పదార్థాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంటర్ పోల్ ఇచ్చిన సమాచారంతో సిబిఐ అధికారులు అప్రమత్తమయ్యారు. విశాఖలోని సిబిఐ తో పాటు కస్టమ్స్ అధికారులను అలెర్ట్ చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన స్పెషల్ టీం కంటైనర్ను పట్టుకుంది. అందులో భారీగా డ్రగ్స్ పట్టుబట్టడంతో విచారణను ప్రారంభించారు. ఆపరేషన్ గరుడ పేరుతో నిర్వహించిన ఈ విచారణ సినీ ఫక్కిని తలపించింది.

జర్మనీలోని హంబర్గ్ మీదుగా ఈనెల 16న సముద్ర మార్గంలో ఈ కంటైనర్ విశాఖ చేరుకున్నట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. ఈనెల 19న నార్కోటిక్స్ సామాగ్రి, నిపుణులతో వచ్చిన సిబిఐ అధికారుల బృందం.. ఆ కంటైనర్ లో డ్రగ్స్ ఉన్నట్లు నిర్ధారించింది. అనంతరం కంటైనర్ ను సీజ్ చేశారు. బ్రెజిల్ లోని శాంతోస్ పోర్టు నుంచి విశాఖకు వచ్చిన ఈ కంటైనర్.. విశాఖలోని కన్సిగ్స్ పేరుతో ఓ ప్రైవేట్ కంపెనీకి డెలివరీ చేయడానికి బుక్ చేశారు. పక్కా ప్లాన్ తో ఈ డ్రగ్స్ ను తరలించినట్లు తెలుస్తోంది. 25 కిలోల చొప్పున వెయ్యి బ్యాగుల్లో నింపి సరఫరా చేసినట్లు తెలుస్తోంది. డ్రై ఈస్ట్ తో మిక్స్ చేసిన ఈ 25 వేల కిలోల డ్రగ్స్ ను సిబిఐ అధికారుల బృందం స్వాధీనం చేసుకుంది.

అయితే సిబిఐ చేపట్టిన ఆపరేషన్లలో ఇదే పెద్దది. దీనికి గరుడ అనే పేరు పెట్టారు. గతంలో కూడా ఇంటర్ పోల్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇంటర్నేషనల్ డ్రగ్ రాకెట్ ముఠా ఆటలను కట్టించేందుకు ఎన్ డి పి ఎస్ చట్టం కింద సిబిఐ పలు ఆపరేషన్లు నిర్వహించింది. మొత్తం సరుకులో ఎంత మొత్తం మత్తు పదార్థాలు ఉన్నాయనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. దీనిపై కొందరు రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా టిడిపి నేతల పేర్లు వినిపిస్తున్నాయి.ఇప్పటివరకు అయితే సిబిఐ అధికారులు ఎవరి పేరు బయట పెట్టలేదు. కానీ లోతైన విచారణ మాత్రం కొనసాగుతోంది.